ఉపమాకకు పర్యాటక శోభ!
రూ. 2 కోట్లతో కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు
ప్రతిపాదనలపై ముఖ్య కార్యదర్శితో నేతల చర్చలు
తొలివిడతలో రూ. 25 లక్షల విడుదలకు గ్రీన్‌సిగ్నల్
నక్కపల్లి : ఉత్తరాంద్రలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వా మి ఆలయాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేసేం దుకు కసరత్తు వేగవంతమైంది. ఈ క్షేత్రాన్ని రూ. 2 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కేంద్ర పర్యాటక శాఖకు వెళ్లాయి. కొండపైకి ఘాట్‌రోడ్, డార్మిటరీలు, బందుర సరస్సు పక్కగా రెయిలింగ్, తాగునీటి సదుపాయం కల్పనకు నిధులు మం జూరు చేయాలని జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖకు తొలుత ప్రతిపాదించారు.
అయితే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. రెండుసార్లు ఇక్కడకు దర్శనానికి వచ్చిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ దృష్టికి ఆ ప్రతిపాదనలను స్థానిక నాయకులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపమాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్‌తో ఎంపీ ముత్తంశెట్టితో పాటు జిల్లా మంత్రి అయ్యన్నపాత్రు డు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ తదితరులు చర్చించినట్లు తెలిసింది.
ఈ విషయమై దేవస్థానం ఈవో పైలా శేఖర్‌బాబును వివరణ కోరగా... ఉపమాకకు రూ. 25 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు పర్యాటక శాఖ అధికారులు చెప్పారన్నారు. ఈ నిదులు త్వరలో విడుదలవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన రూ. 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు.