దేవుడికి దయలేదు..!
అంతా పోయారు.. ఎవరి కోసం బతకాలంటూ ఆవేదన
విశాఖపట్నం: ఏడ్చిఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి... గుండెలు బండబారిపోయాయి. అయిన వారంతా దూరమవడంతో వారిని తలచుకుంటూ గుండెలవిసేలా రోది స్తున్నారు... వ్యాను ప్రమాదంలో కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు.. అందరినీ పోగొట్టుకున్న అభాగ్యుడు ఈగల వెంకులు. ఈయన కుమారుడే వ్యాన్ డ్రైవరు, యజమాని అప్పారావు. వెంకులు వయసు 85 ఏళ్లు. కొడుకు అప్పారావు సంపాదనపైనే జీవనం సాగిస్తున్నాడు.
ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆయన్ని ఇంటికి చేర్చారు. నాకు దిక్కెవరంటూ ఆయన రోది స్తున్న తీరు అందరినీ కలచివేసింది. ‘‘నేను పొద్దున్నే టీ తాగడానికి ఒటేలు దగ్గిరికెల్లేను. అక్కడ సెప్పేరు. మీ వోల్లంతా యాస్కెం టులో పోయారని. నా కొడుకు, కోడలు, వారి కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇంకా సుట్టాలు సచ్చిపోయారని సెప్పారు బాబూ.. ఇంకా నేనెం దుకు బతకాల.. ఎవరికోసం బతకాల.. నన్నొక్కడ్నే వదిలేసి ఆల్లందరిన్నీ తీసుకుపోయేడు దేవుడు.. ఆ దేవుడికి నాయం లేదు.. నాకు దిక్కెవలూ లేరు. ఇంకెందుకు నా బతు కు?’’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు.