Venugopal bekkem
-
సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్‌ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్‌ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. నేడు(ఏప్రిల్ 27) బెక్కెం వేణుగోపాల్ బర్త్ డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్’, సుడిగాలి సుధీర్‌తో నరేష్ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
ఈ విజయం మధురం!
‘‘ఇప్పటివరకూ చేసిన చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి. వాటన్నిటి కన్నా మించిన ఆదరణ ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం పాటలకు లభిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర అన్నారు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్ (గోపి), రూపేష్ డి.గోవిల్, జి. సునీత నిర్మించిన ‘సినిమా చూపిస్త మావ’ వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం పాటల గురించి శేఖర్ చంద్ర మాట్లాడుతూ- ‘‘కృష్ణంరాజు, సునీల్, కోన వెంకట్ తదితర సినీ ప్రముఖులు పాటలు బాగున్నాయని అభినందించారు. ఆ అభినందనలు ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఈ పాటల విజయం నాకు మధురాతి మధురం’’ అని చెప్పారు.