Veteran soldier
-
ప్రపంచంలోనే తొలిసారిగా కంటిమార్పిడి
న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగాన్ వైద్య సంస్థకు చెందిన వైద్యులు ఈ ఘనత సాధించారు. కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బ తిన్న ఆరోన్ జేమ్స్ అనే మాజీ సైనికుడు కంటి మారి్పడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటిదాకా కరోనాను మార్చిన ఉదంతాలున్నాయి గానీ ఇలా పూర్తిగా కంటినే కొత్తగా అమర్చడం మాత్రం ఇదే తొలిసారి. ‘‘మే 21న ఈ ఆపరేషన్ నిర్వహించాం. రోగికి మొత్తం ముఖం ఎడమ భాగమంతటితో పాటు ఎడమ కంటిని కూడా పూర్తిగా కొత్తగా అమర్చాం. మొత్తం ప్రక్రియలో ఏకంగా 140 మంది వైద్య నిపుణుల సేవలు తీసుకున్నాం. అతనికి ఎడమ కంటిలో చూపు రాలేదు. కాకపోతే ఆర్నెల్ల తర్వాత కూడా ఆ కన్ను పూర్తి ఆరోగ్యంతో ఉండటమే ఓ అద్భుతం. రెటీనాకు రక్తప్రసారం బాగా జరుగుతోంది. కంటికి రక్తం తీసుకొచ్చే నాళాల పనితీరు సజావుగా ఉంది. ఇది నిజంగా గొప్ప విషయం. చూపు కూడా ఎంతో కొంత వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది’’ అని వైద్య బృందం వివరించింది. అయితే, ‘‘ఇది కేవలం కంటిని పూర్తిగా మార్చడం సాధ్యమేనని నిరూపించేందుకు చేసిన సాంకేతిక ఆపరేషన్ మాత్రమే. అయితే దాత తాలూకు మూల కణాలను, బోన్ మారోను దృష్టి నరంలో చొప్పించాం. కనుక చూపు వచ్చే ఆస్కారాన్నీ కొట్టిపారేయలేం’’ అని చెప్పింది! -
‘సైనికుడై ఉండి కుటుంబ హత్య.. ఆత్మహత్య’
కెనడా: అతడు యుద్ధంలో వీర సైనికుడు. శత్రు మూకల్ని పరుగెత్తించి తుదముట్టించాడు. ఆ సైన్యంలోని సైనికులందరిలోకెల్లా కూడా గుర్తింపు పొందాడు. కానీ, చివరకు హంతకుడయ్యాడు. మొత్తం కుటుంబాన్ని చంపేసి తనను తాను కాల్చుకొని చనిపోయి అందరినీ షాక్ గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన లియోనల్ డెస్మాండ్ (33) అనే వ్యక్తి కెనడా సైనిక విభాగంలో 2004లో చేరాడు. జనవరి 2007 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు అఫ్గనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన మిషన్‌లో పాల్గొని అక్కడ అత్యుత్తమ కనబరిచాడు. అతడు సైన్యంలో చేరిన తర్వాత పాల్గొన్న తొలి విదేశీ మిషన్ కూడా ఇదే. ఈ మిషన్ పూర్తయిన తర్వాత తిరిగి ప్రస్తుతం కెనడాలోని నోవా స్కోటియాలో ఉంటున్నారు. అయితే, అనూహ్యంగా గత వారం వారి కుటుంబం మొత్తం శవాలుగా మారి కనిపించింది. లియోనల్ తన భార్య షానాను, పదేళ్ల కూతురు అలియాను, తల్లి బ్రెండాను తుపాకీతో కాల్చి చంపడమే కాకుండా తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే అతడు ఇలా చేశాడని పోస్టుమార్టం నివేదికలో తెలిసింది.