మృత్యువుతో మోడల్ పోరాటం
న్యూయార్క్: ప్రముఖ డచ్ మోడల్ ఫ్కేస్టర్మ్ ప్రాణాలకోసం పోరాడుతోంది. ఇటీవల పడవ ప్రమాదానికి గురైన ఆమె ప్రస్తుతం కోమాలో ఉండి తిరిగి ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె విక్టోరియా సీక్రెట్ చానెల్, మార్క్ జాకబ్స్, టీవీ షో హాలాండ్ సంస్థలకు మోడల్‌గా నటిస్తున్న ఆమె భవిష్యత్తులో మోడల్‌గా అగ్రస్థానంలోకి దూసుకెళ్లాల్సి ఉంది.
ఇటలీ ఐలాండ్ తీరంలో ఘోర పడవ ప్రమాదానికి గురై ఫ్కేస్టర్మ్ పుర్రెభాగం బాగా దెబ్బతిన్నది. దీంతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ప్రస్తుతం కోమాలోకి జారుకున్నారు. ఆమె వెన్నెముక భాగానికి కూడా దెబ్బతగిలిందని, ఆమెకు పక్షవాతం వచ్చే అవకాశం కూడా లేకపోలేదని వైద్యులు చెప్తున్నారు.