వీడియోతో వెల్కమ్
లండన్: మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రిటన్ లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అధికారిక సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. మోదీ పర్యటనను స్వాగతించిన వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతోషంగా ఆహ్వానిస్తున్న వీడియోనొక దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.
మోదీ పర్యటనను స్వాగతించిన వివిధ రంగాలకు చెందిన పలువురు, ప్రముఖులు, విద్యార్థులు ఈ వీడియోలో మోదీకి స్వాగతం చెప్పారు. 'ప్రధాని మోదీకి స్వాగతం... మా దేశానికి రావడం....మాకు చాలా సంతోషంగా ఉంది.. భారత దేశంతో సన్నిహిత సంబంధాలు ఎంత ముఖ్యమో మీకే తెలుస్తుంది' అంటూ ఈ వీడియో మొదలవుతుంది.
Welcome to the UK @narendramodi from Britain's Indian community #ModiInUK https://t.co/5hrlplmx4Q
— UK Prime Minister (@Number10gov) November 12, 2015