సమాజాన్ని అధ్యయనం చేయాలి
విజయవాడ కల్చరల్: బాలబాలికలు సమాజాన్ని అధ్యయనం చేయాలని అఖిల భారత విద్యాభారతి సహ సంయోజక్ రేఖా చుడసమా వివరించారు. విద్యాభారతి సంస్థ ప్రకాశం కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన బాలికలకు çసత్యనారాయణపురంలోని శిశు విద్యామందిర్‌లో శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాలికలు పాఠశాల విద్యతోపాటు సమాజాన్ని అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. బాల,కౌమార దశలో ఉన్న బాలబాలికలకు అన్ని అంశాలోనూ శిక్షణ నివ్వాలని కోరారు. విజ్ఞాన విహార్ పాఠశాలల కార్యదర్శి ఎంఆర్కే. మూర్తి, విద్యావేత్తలు ఓంకార నరసింహమూర్తి, జగదీష్, వినయ్‌కుమార్, టీవీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.