కళకళలాడిన ‘ఇన్స్పైర్’
ఎగ్జిబిట్లను తిలకించిన 40వేలమంది విద్యార్థులు
రేపటితో ముగియనున్న కార్యక్రమం
నెక్కొండ : మండలకేంద్రంలోని విద్యోదయ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఇన్స్పైర్ కార్యక్రమాన్ని తిలకించేందుకు రెండోరోజైన ఆదివా రం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. దీంతో పాఠశాల ప్రాం గణం కిక్కిరిసిపోయింది. విద్యార్థులతో కళకళలాడింది. నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మహబూబాబా ద్, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పాఠశాలలకు చెందిన దాదాపు 40వేలమందికిపైగా విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లను తిలకిం చారు. విద్యార్థులు ఒక్కో ఎగ్జిబిట్‌ను సునిశి తంగా పరిశీలిస్తూ ముందుకుసాగారు.
కార్యక్రమంలో ప్రదర్శించిన 550కిపైగా ఎగ్జిబిట్లను పరిశీలించేందుకు ఒక్కో విద్యార్థికి రెండుగంట లకుపైగా సమయం పట్టింది. పాఠశాల బస్సు లు, డీసీఎంలలో తరలివచ్చిన విద్యార్థులు ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉండడం గమనార్హం. మహబూబాబాద్ డిప్యూటీ డీఈవో రవీందర్‌రెడ్డి, ఎంఈ వో రత్నమాల, విద్యోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా నాగార్జున్రెడ్డిఎగ్జిబిట్లను సందర్శించారు. ఎగ్జిబిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
నిజజీవితంలోనూ సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు, టీయూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బూర్గుపల్లి శ్రావణ్, వడుప్సా నాయకుడు కోడూరి అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు గ్రేస్మణి, అనంతుల మురళీధర్, రామారపు రవి, లక్ష్మణ్‌రావు, అనిల్‌కుమార్, పీఈటీలు కొమ్ము రాజేందర్, బిక్షపతి, అయిలయ్య, ఆర్.బిక్షపతి, శంకర్, కైలాష్, విజయ్, ప్రవీణ్‌రెడ్డి, సంపత్, సారంగపాణి, సుధీర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.