నక్సల్స్ను పట్టుకోండి: నజరానా అందుకోండి
రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న ఏడుగురు మావోయిస్టులను పట్టుకోవాలని నితీష్ సర్కార్ సంకల్పించింది. అందుకోసం ఆ మావోయిస్టులను ప్రజలు పట్టుకుని తమకు అప్పగిస్తే రూ. 3 నుంచి 5 లక్షల నజరానా అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు గురువారం బీహార్ రాజధాని పాట్నాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్ కుమార్ అలియాస్ అరవింద్ సింగ్ పట్టుకుంటే రూ.5 లక్షలు, అలాగే బీహార్ ఏరియా ప్రతేక దళ సభ్యుడు విజయ్ యాదవ్ అలియాస్ సందీప్, శివశంకర్ దోబి అలియాస్ త్యాగీ, పర్వేశ్ అలియాస్ అంజు, రామ్ బాబు రామ్, ప్రజాపతి, చిరగ్లను పట్టుకుంటే రూ. 3 లక్షల నగదు బహుమతి అందజేస్తామని పేర్కొంది. ఆ మావోయిస్టులు నాయకులంతా జహెనాబాద్, ఔరంగబాద్, గయ, జుమాయి,మోతహరీ ప్రాంతాలకు చెందిన వారని పోలీసుల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.