అలా వచ్చి క్యాష్ బ్యాగ్‌తో ఉడాయించారు
విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌లో సోమవారం దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఎస్బీహెచ్ నుంచి 50 వేల రూపాయలు డ్రా చేసుకుని వెళ్తున్నాడో వృద్ధుడు. అది గమనించిన దొంగలు వృద్ధుడిని అనుసరించారు. బైక్‌పై వచ్చిన దొంగలిద్దరూ ఆ వృద్ధుడి నుంచి డబ్బుల బ్యాగ్ ను అపహరించారు. చేతులోని బ్యాగ్‌లో ఉన్న సొమ్ము కాస్తా దొంగల పాలు కావడంతో లబోదిబోమన్నాడు.
దగ్గరోలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు తన బ్యాగ్ ఎత్తుకెళ్లిపోయారంటూ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.