పోలీస్ అవతారంలో విష్ణుమూర్తి
కృష్ణుడు, విన్నీ ముఖ్య తారలుగా బేబీ నిహారిక సమర్పణలో రూపొందిన చిత్రం ‘విష్ణుమూర్తి’. ‘ఇప్పుడు పోలీస్ అవతారంలో’ అనేది ఉపశీర్షిక. కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో సూర్యభగవాన్ క్రియేషన్స్ పతాకంపై మిత్తాన ఈశ్వర్ నిర్మించారు. వచ్చే నెల 20న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా మిత్తాన ఈశ్వర్ మాట్లాడుతూ -‘‘ఇది సోషియో ఫాంటసీ చిత్రం. లవ్, సెంటిమెంట్, కామె డీ, రొమాంటిక్ మేళవించి తీశాం. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఉంటుంది. రాజ్‌కిరణ్ మంచి పాటలు ఇచ్చారు.
ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేసిన రోజునే ఓవర్సీస్లో జింగ్రీల్.కామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: వెంకట్ కట్టా, మాటలు: నండూరి వీరేష్, కెమెరా: జీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముసిలి వెంకటేశ్వరరావు.