అగస్టా మాతృసంస్థపై విచారణ నిలిపివేత
రోమ్: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీ మాతృ సంస్థ ఫిన్మెకానికాపై విచారణను ప్రాసిక్యూటర్లు మంగళవారం నిలిపివేశారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం రూ.3,600 కోట్ల విలువైన ఒప్పందం వెనక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు రాగా.. ఈ అవినీతి ఆరోపణలపై ఫిన్మెకానికా చేయాల్సింది ఏమీ లేదంటూ ప్రాసిక్యూటర్లు అభిప్రాయపడ్డారని ఈ మేరకు ఇటాలియన్ వార్తాసంస్థ ‘అన్సా’ వెల్లడించింది.