viral fevars
-
కృష్ణాజిల్లాలో ప్రబలిన విషజ్వరాలు
విజయవాడ: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల బొడ్డపాడు గ్రామంలో విషజ్వరాలు ప్రబలి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన అరుణకుమారి డెంగ్యూ లక్షణాలతో మృతిచెందగా.. మరో 30 మంది విష జ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సీర్సీపీ నాయకులు తాతినేని పద్మావతి, అనిల్‌కుమార్ గ్రామానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. తక్షణం గ్రామంలో ప్రభుత్వ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
సింగనమలలో విష జ్వరాలు
సింగనమల: అనంతపురం జిల్లా సింగనమల మండలం ఆకులేడు గ్రామంలో విషజ్వరాలు ప్రభలుతున్నాయి. గ్రామంలో సుమారు 200 మందికి విషజ్వరాలు సోకాయి. ఈ విషజ్వరం బారిన పడి ఇప్పటికే గ్రామానికి చెందిన మోషప్(6) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చాలామంది విషజ్వరాలతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లే స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పదించి తగిన చర్యలు తీసుకోవాలని బాదితులు వాపోతున్నారు.