దేశం పరువు తీసిన వీరేంద్రపై వేటు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత క్రీడాకారుల బృందంతో కలసి స్కాట్లాండ్ వెల్లిన రెజ్లింగ్ రెఫరీ వీరేంద్ర మాలిక్‌పై వేటుపడింది. స్కాట్లాండ్లో లైంగిక వేధింపులకు పాల్పడి వీరేంద్ర మాలిక్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
దేశం పరువు తీసిన మాలిక్‌పై రెజ్లింగ్ సమాఖ్య కఠిన చర్యలు తీసుకుంది. స్కాట్లాండ్ పోలీసుల కస్టడీలో ఉన్న మాలిక్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. స్కాట్లాండ్లోనే దాడి కేసులో భారత్ ఒలింపిక్ సంఘం సీనియర్ అధికారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.