రెటీనాపైకే వీడియోలు!
సినిమాలు, వీడియోలు, ఫొటోలను నేరుగా రెటీనాపైకే పంపే వినూత్న వర్చువల్ రెటీనల్ డిస్ప్లే హెడ్సెట్ ఇది. ఇది పెట్టుకుంటే ఇక అంతా త్రీడీ మయమే! వీడియోలను మామూలుగానే కాదు.. త్రీడీ రూపంలోనూ కంట్లోకి పంపించడం దీని ప్రత్యేకత. ఒక్కో వైపు పది లక్షల మైక్రోస్కోపిక్ అద్దాలు అమర్చిన ఈ హెడ్సెట్ మన కళ్ల మాదిరిగానే దృశ్యాలను ప్రతిఫలింపచేస్తూ వాటిని నేరుగా రెటీనాపైకి పంపుతుంది.
దీనిని మొబైల్ ఫోన్లకు కూడా అనుసంధానించి వీడియోలు, సినిమాలను చూడొచ్చు. వీడియో గేమ్‌లు ఆడుకోవచ్చు. అత్యంత నాణ్యతతో ఆడియో పాటలూ వినొచ్చు. గ్లిఫ్ అనే ఈ హెడ్‌సెట్‌ను మిచిగన్‌కు చెందిన ఎవెగెంట్ కంపెనీ తయారు చేసింది. ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ధర రూ.30 వేలు మాత్రమే!