Visakhapatnam Corporation
-
బీసీలకే విశాఖ మేయర్ పీఠం
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ బీసీలకే కేటాయించిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 80కి పైగా వార్డులను వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమని చెప్పారు. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌లతో కలిసి సోమవారం విశాఖలో పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ అభివృద్ధి కోరుకునే వారంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ పాలనంతా గ్రాఫిక్‌లు, అబద్ధాల మయమని, బాబుకు ఉన్న సినిమాల పిచ్చినంతా.. పాలనలో ఉపయోగించాడే తప్ప ప్రజల యోగ క్షేమాలను పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూదోపిడీని, ముఖ్యంగా విశాఖలో జరిగిన భూ కుంభకోణాలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. తెలుగు దోపిడీ దొంగలను తరిమికొట్టాలి తెలుగు దోపిడీ దొంగలైన చంద్రబాబు, ఆయన తనయుడిని పురపాలక ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ఏపీ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పంచాయతీల్లో పది శాతం కూడా టీడీపీ గెలవలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలవనుందని చెప్పారు. తన అనుకూల మీడియా ద్వారా సర్వేలు చేయించుకున్న చంద్రబాబు ఓడిపోతామని తెలిసి విశాఖకు పరిగెత్తుకుంటూ వచ్చారని తెలిపారు. గత ఐదేళ్లలో విశాఖకు చేసిన ఒక పనైనా చెప్పారా? చెప్పడానికి ఏమీ లేక హుద్‌హుద్ సమయంలో బస్సులో ఉన్నాను.. బస్సులో తిన్నాను.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖకు ఏమీ చేయలేని వాడివి.. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ గెలిచి విశాఖకు ఏమిచేస్తావు చంద్రబాబూ అని విమర్శించారు. -
వాహ్..విశాఖ
- టాప్‌టెన్ మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో విజయవాడకు దక్కని చోటు - మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిన పది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాలో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తాత్కాలిక రాజధాని విజయవాడ చోటు దక్కించుకోలేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నగరం నుంచే పరిపాలన నడిపిస్తున్నా పరిస్థితిలో మార్పురాలేదు. సేవలు, సౌకర్యాల్లో చిన్న పట్టణాల స్థాయిని కూడా విజయవాడ అందుకోలేకపోయింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 97 మున్సిపాలిటీల్లో టాప్ టెన్ జాబితాను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో విశాఖపట్నం కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలవగా, అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ రెండో స్థానంలో, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో గుంటూరు కార్పొరేషన్, ఐదో స్థానంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, ఆరో స్థానంలో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఏడో స్థానంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎనిమిదో స్థానంలో తూర్పుగోదావరిలోని అమలాపురం, తొమ్మిదో స్థానంలో ప్రకాశం జిల్లా చీరాల, పదో స్థానంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్ నిలిచాయి. 11 అంశాలకు వంద మార్కులిచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన టాప్ పది మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్‌కు 53.09 శాతం మార్కులురాగా, హిందూపురం మున్సిపాలిటీకి 50.88, కొవ్వూరు మున్సిపాలిటీకి 49.94 మార్కులొచ్చాయి. సేవలు, సౌకర్యాలు చెత్తే.. తాత్కాలిక రాజధాని వీటి స్థాయిని కూడా అందుకోలేక చతికిలబడింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం, ఆస్తి పన్ను వసూళ్లు, సిటిజన్ చార్టర్ అమలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించడం, ఆర్థిక పరిస్థితి, స్కూళ్లలో ఐఐటీ ఫౌండేషన్, వ్యక్తిగత, ఉమ్మడి మరుగుదొడ్ల ఏర్పాటు-నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు నిర్వహణ, టౌన్‌ప్లానింగ్ కార్యకలాపాలు, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, స్కిల్ డెవలప్మెంట్, గ్రీనరీ ఏర్పాటులో పని తీరును బట్టి మార్కులిచ్చారు. ఈ అంశాల్లో దేనిలోనూ విజయవాడ కార్పొరేషన్‌కు మార్కులు వచ్చే పరిస్థితి లేదు. చెత్త నిర్వహణ అధ్వానంగా తయారవడంతో స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజ్ఞప్తుల పరిష్కారంలోనూ కార్పొరేషన్ బాగా వెనుకబడింది. మిగిలిన అన్ని విషయాల్లోనూ అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం. మొన్నటివరకూ జీతాలిచ్చే పరి స్థితి కూడా లేదు. అన్నింట్లో వెనుకబడిన తాత్కాలిక రాజధాని టాప్‌టెన్ జాబితాలో చోటు దక్కించుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రేపటి నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి
విశాఖ రేంజి డీఐజీ రవిచంద్ర చోడవరం: ఆగస్టు ఒకటో తేదీ నుంచి విశాఖ కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో వాహనచోదకులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని విశాఖ రేంజి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎ.రవిచంద్ర పేర్కొన్నారు. చోడవరం పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని గురువారం పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల పోలీసు అధికారులతో నేరాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడుతూ తన పరిధిలోని మూడు జిల్లాల్లో కొత్తగా పోలీసు స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన లేదని, ఉన్న వాటిని బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. సిబ్బంది కొరత ఉందని, వచ్చే సెప్టెంబరులో 68మంది ఎస్ఐలు, 25మంది ఆర్ఎస్ఐలు ట్రైనింగ్‌పూర్తిచేసుకొని కొత్తగా విధుల్లోకి రానున్నారన్నారు. వారిని అవసరమైన పోలీసు స్టేషన్లకు కేటాయిస్తామన్నారు.ప్రతి పోలీసు స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. యలమంచిలి సర్కిల్ పరిధి పెద్దదిగా ఉందని, దీనిని యలమంచిలి, నక్కపల్లిలా రెండుగా విభజించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని డీఐజీ చెప్పారు. గిరిజనుల నాశనమే పోరాట సిద్ధాంతమా? గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టుల పోరాట సిద్ధాంతమా అని డీఐజీ ప్రశ్నించారు. గిరిజనులు పోలీసులకు ఇన్ఫార్మర్లు కాదని, మావోయిస్టులకు అన్ని విధాలా ఆశ్రయం ఇస్తున్నారన్నారు. గిరిజనులనే మావోయిస్టులు చిత్రహింసలకు గురిచేస్తూ కిడ్నాప్‌లు, కాల్చేయడాలు చేస్తున్నారన్నారు. అమాయక గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టుల పోరాట లక్ష్యమా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం వినియోగించే యంత్రాలను తగులబెట్టడం సరికాదన్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌కు ఏ ఇన్ఫార్మర్ సాయం లేదని, పోలీసుల సాధారణ కూబింగ్‌లో మావోయిస్టులు ఎదురైనప్పుడు జరిగిన కాల్పులు మాత్రమేనని ఆయన చెప్పారు. గంజాయి స్మగర్లతో పోలీసు అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నది మావోయిస్టులే అన్నారు. నిజంగా ఏజెన్సీలో గంజాయిని నిర్మూలించాలనే లక్ష్యం మావోయిస్టులకు ఉంటే వారి సమీపంలో ఉన్న తోటలను వారే ధ్వంసం చేయాలని డీఐజీ కోరారు. సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం,చోడవరం సీఐ కిరణ్‌కుమార్ ఉన్నారు.