vishal agarwal
-
విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు!
సాక్షి, చెన్నై : నటి మీరామిథున్ తన వివాదస్పద వ్యాఖ్యలకు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ మధ్య హీరోలు విజయ్, సూర్యలను వ్యక్తిగతంగా విమర్శలు చేసి వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా మీరామిథున్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అయినా నటి మీరామిథున్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవలే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో వివాదస్పద అంశానికి తెర తీశారు. ఈసారి విశాల్‌ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మేనేజర్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అందులో విశాల్ తనను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడు ఏళ్లుగా అడుగుతూ వచ్చారని మీరా మిథున్ పేర్కొన్నారు. తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే తనకు ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే విశాల్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు తెలిపారు. మరి దీనికి విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
మూడేళ్ల తర్వాత ఆ వ్యాపారి అరెస్టు
హైదరాబాద్: గత మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యాపారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాల్ అగర్వాల్ అనే వ్యక్తి వీకే ఏజెన్సీస్ పేరుతో వివిధ ఆయిల్స్, బిస్కట్లు, సబ్బుల కంపెనీల నుంచి హోల్ సేల్ గా అరువుపై సరుకులు కొనుగోలు చేసేవాడు. ఆ సరుకును రిటైల్ వ్యాపారులకు విక్రయించి ఆయా కంపెనీలకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. దీంతో రూ.1.50కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు. ఈ మోసాలపై గతంలో హైదరాబాద్ కు చెందిన బాధితులు సంజీవ్ మూలాగే, ఆరిఫ్ కేతన్, శ్యామ్ సుందర్, వీరేందర్ సింగ్ తదితరులు సీసీస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్ అగర్వాల్, ఆనంద్ గోహ అనే వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న విశాల్ అగర్వాల్‌ను ఎట్టకేలకు సీసీఎస్ పోలీసులు కొండాపూర్‌లో తాజాగా అదుపులోకి తీసుకున్నారు.