హైదరాబాద్: గత మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యాపారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాల్ అగర్వాల్ అనే వ్యక్తి వీకే ఏజెన్సీస్ పేరుతో వివిధ ఆయిల్స్, బిస్కట్లు, సబ్బుల కంపెనీల నుంచి హోల్ సేల్ గా అరువుపై సరుకులు కొనుగోలు చేసేవాడు. ఆ సరుకును రిటైల్ వ్యాపారులకు విక్రయించి ఆయా కంపెనీలకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. దీంతో రూ.1.50కోట్ల మేర మోసానికి పాల‍్పడ్డాడు.
ఈ మోసాలపై గతంలో హైదరాబాద్ కు చెందిన బాధితులు సంజీవ్ మూలాగే, ఆరిఫ్ కేతన్, శ్యామ్ సుందర్, వీరేందర్ సింగ్ తదితరులు సీసీస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్ అగర్వాల్, ఆనంద్ గోహ అనే వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న విశాల్ అగర్వాల్‌ను ఎట్టకేలకు సీసీఎస్ పోలీసులు కొండాపూర్‌లో తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
మూడేళ్ల తర్వాత ఆ వ్యాపారి అరెస్టు
Published Tue, Mar 7 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement