businessman arrested
-
షెల్ కంపెనీ ద్వారా భారీ విరాళం : వ్యాపారి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : షెల్ కంపెనీ ద్వారా ఢిల్లీలో పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి రూ 2 కోట్ల విరాళం అందించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని ఢిల్లీకి చెందిన వ్యాపారి ముఖేష్ శర్మగా గుర్తించినట్టు ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు వెల్లడించారు. వీరిపై 2014, మార్చి 31న డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఆప్‌కు విరాళం అందచేశారనే ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన ముఖేష్ శర్మ పొగాకు వ్యాపారంతో పాటు ప్రాపర్టీ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఆప్ బహిష్కృత నేత ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కపిల్ మిశ్రా సైతం ఆప్‌కు షెల్ కంపెనీ ద్వారా విరాళం అందిందని ఆరోపించారు. ఆప్‌కు నిధులను సమీకరించడంలో తీవ్ర అవకతవకలు చోటుచేసకున్నాయని అప్పట్లో మిశ్రా ఆరోపించారు. పార్టీకి అందిన రూ 2 కోట్ల విరాళంపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఆప్‌కు పలు షెల్ కంపెనీల నుంచి నిధులు లభించాయని, పార్టీకి సైతం ఈ విషయం తెలుసునని మిశ్రా ఆరోపించారు. చదవండి : వామ్మో.. ఇదేందిది ఇంత ట్రాఫిక్ జామ్! -
భర్త వికృత చర్యపై పోలీసులకు భార్య ఫిర్యాదు
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ లైంగికానందం కోసం బలవంతంగా భార్యలను మార్పిడి చేసుకుంటున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఓ మహిళ తన భర్తతోపాటు, మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. వ్యాపారవేత్త అయిన భర్త తనను అక్రమ లైంగిక సంబంధంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలోని సమతానగర్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని బుధవారం ఆ వ్యాపారవేత్త(46)ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి డిసెంబర్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాగా భర్త తన వికృత కోర్కెను భార్య ముందు ఉంచగా, అందుకు ఆమె అంగీకరించలేదు. తనకు ఇలాంటి వ్యవహారంలో పాల్గొనడం ఇష్టం లేదని భార్య స్పష్టం చేసింది. అయితే ఆమెను బెదిరించి, భయపెట్టి బలవంతంగా పర పురుషుడి వద్దకు పంపాడు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడిన భర్త.. భార్య మార్పిడిలో పాల్గొన్నప్పుడు రహస్యంగా వీడియో తీశాడు. అప్పటినుంచి ఈ దారుణం గురించి ఎవరికీ చెప్పకుండా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అయితే భర్త చేష్టలతో విసిగిపోయినా బాధితురాలు అతడి నుంచి దూరంగా వెళ్లి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. ఈ విషయమంతా తల్లిదండ్రులకు చెప్పడంతో భార్య మార్పిడికి సహకరించే ఇతర జంటలను తన భర్త ఎలా కలుసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. అతను తన వాట్సాప్ గ్రూప్.. సోషల్ మీడియా ద్వారా ఇతర జంటలతో మాట్లాడి దీనికి పాల్పడుతున్నట్లు తెలిసిందని వెల్లడైంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడేళ్ల తర్వాత ఆ వ్యాపారి అరెస్టు
హైదరాబాద్: గత మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యాపారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాల్ అగర్వాల్ అనే వ్యక్తి వీకే ఏజెన్సీస్ పేరుతో వివిధ ఆయిల్స్, బిస్కట్లు, సబ్బుల కంపెనీల నుంచి హోల్ సేల్ గా అరువుపై సరుకులు కొనుగోలు చేసేవాడు. ఆ సరుకును రిటైల్ వ్యాపారులకు విక్రయించి ఆయా కంపెనీలకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. దీంతో రూ.1.50కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు. ఈ మోసాలపై గతంలో హైదరాబాద్ కు చెందిన బాధితులు సంజీవ్ మూలాగే, ఆరిఫ్ కేతన్, శ్యామ్ సుందర్, వీరేందర్ సింగ్ తదితరులు సీసీస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్ అగర్వాల్, ఆనంద్ గోహ అనే వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న విశాల్ అగర్వాల్‌ను ఎట్టకేలకు సీసీఎస్ పోలీసులు కొండాపూర్‌లో తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
మాఫియా వ్యాపారి నుంచి వేల కోట్లు స్వాధీనం
ఇటలీలో ఓ వ్యాపారవేత్త నుంచి యాంటీ మాఫియా పోలీసులు కళ్లుతిరిగే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్, కంపెనీలు, బ్యాంకు ఖాతాలు, షాపింగ్ మాల్.. ఇలా వాళ్లు స్వాధీనం చేసుకున్న పలు రకాల ఆస్తుల విలువ ఏకంగా రూ. 1615 కోట్లుగా తేలింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఓ మాఫియా గ్యాంగు తరఫున ఆర్థిక లావాదేవీలు నడిపించిన ఆల్ఫోన్సో అనుంజియాటా అనే వ్యాపారవేత్తవద్ద నుంచి ఈ మొత్తం ఆస్తులు పోలీసుల చేతికి వచ్చాయి. ఎల్ అనుంజియాటా షాపింగ్ మాల్తో పాటు ఆరు కంపెనీలు, 85 రియల్ ఎస్టేట్ ఆస్తులు, 42 బ్యాంకు ఖాతాలు, రూ. 5 కోట్ల నగదును తాము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుంజియాటాను గత సంవత్సరం మార్చిలోనే పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, బెదిరింపులు, మనీలాండరింగ్ రాకెట్లను కొన్ని దశాబ్దాలుగా ఈ మాఫియా నడిపిస్తోంది. అంతర్జాతీయ క్రైం సిండికేట్లలో ఇటాలియన్ల పేరు కూడా మార్మోగిపోతోంది.