Vishnuvardhan goud
-
టైటిల్ పోరుకు విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ జంట
పారిస్: తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ ద్వయం 21–17, 21–17తో కాలమ్ హెమ్మింగ్–స్టీవెన్ స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బెన్ లేన్–సీన్ క్యాండీ (ఇంగ్లండ్) జంటతో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం ఆడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సైనా 17–21, 17–21తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 18–21, 9–21తో టాప్ సీడ్ జాంగ్‌కోల్ఫాన్–రవింద ప్రజోగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో అశ్విని పొన్నప్ప–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 9–21, 23–21, 7–21తో నోర్ నిక్లాస్–అమేలియా (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది. -
విజేత విష్ణువర్ధన్
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు రెండో సీడ్ విష్ణువర్ధన్ గౌడ్ విజేతగా నిలిచాడు. అనంతపురం నగరంలో నిర్వహించిన పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్స్‌లో విష్ణువర్ధన్ 19-21, 21-13, 21-14తో నాలుగో సీడ్ ప్రణయ్ (విశాఖపట్నం)పై విజయం సాధించాడు. బాలికల డబుల్స్‌లో పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి విజేతగా నిలిచింది. గాయత్రి గోపీచంద్-వైష్ణవీ రెడ్డి (రంగారెడ్డి) జంట 21-19, 21-19తో నిషిత వర్మ- టాప్ సీడ్ రమీజా ఫైజాన్ (వరంగల్) జంటపై గెలుపొందారు. బాలుర డబుల్స్‌లో ప్రసాద్ (కరీంనగర్)-తరుణ్ (ఖమ్మం) జోడి 21-8, 19-21, 21-15తో షణ్ముఖ్ అంజన్ (పశ్చిమ గోదావరి)-విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడిని ఓడించి టైటిల్ సాధించారు. బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ అక్షిత (తూర్పు గోదావరి) టైటిల్ కైవ సం చేసుకుంది. ఆమె 21-12, 21-9తో రెండో సీడ్ నిషిత వర్మ (విశాఖపట్నం)పై గెలిచింది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.