జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు రెండో సీడ్ విష్ణువర్ధన్ గౌడ్ విజేతగా నిలిచాడు. అనంతపురం నగరంలో నిర్వహించిన పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్స్‌లో విష్ణువర్ధన్ 19-21, 21-13, 21-14తో నాలుగో సీడ్ ప్రణయ్ (విశాఖపట్నం)పై విజయం సాధించాడు. బాలికల డబుల్స్‌లో పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి విజేతగా నిలిచింది. గాయత్రి గోపీచంద్-వైష్ణవీ రెడ్డి (రంగారెడ్డి) జంట 21-19, 21-19తో నిషిత వర్మ- టాప్ సీడ్ రమీజా ఫైజాన్ (వరంగల్) జంటపై గెలుపొందారు. బాలుర డబుల్స్‌లో ప్రసాద్ (కరీంనగర్)-తరుణ్ (ఖమ్మం) జోడి 21-8, 19-21, 21-15తో షణ్ముఖ్ అంజన్ (పశ్చిమ గోదావరి)-విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడిని ఓడించి టైటిల్ సాధించారు.
బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ అక్షిత (తూర్పు గోదావరి) టైటిల్ కైవ సం చేసుకుంది. ఆమె 21-12, 21-9తో రెండో సీడ్ నిషిత వర్మ (విశాఖపట్నం)పై గెలిచింది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
విజేత విష్ణువర్ధన్
Published Sun, Nov 3 2013 11:48 PM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM
Advertisement
Advertisement