విద్యుత్ సమస్యలు తీరనున్నాయి..
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్
మర్పల్లి: రాష్ట్రంలో నెలకొన్న విద్యూత్ సమస్యలు మరికొంత కాలంలో తీరనున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షడు విఠల్ తండ్రి మాణయ్య (80) బుధవారం అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం తెలసుకున్న మంత్రి రాజేందర్ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఉపాధ్యక్షుడు పల్లె రవితో కలిసి ఆదివారం బిల్కల్ గ్రామంలో విఠల్‌ను పరామర్శించారు.
మాణయ్య మృతి విషయృమె విఠల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కోతలపై స్థానిక నాయకులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాదానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గతంలో కన్నా ఎక్కువగా ఉందన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనవిధానాలే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు కారణ మన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యలను తీర్చేందకు పొరుగు రాష్ట్రాల నుండి కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైస్‌ఎంపీపీ అంజయ్య, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్, స్థానిక సర్పంచ్ పడుమటి అనుసూజ కుమారుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
విఠల్‌ను పరామర్శించిన దామోదర్ రాజనర్సింహ్మ...
విఠల్ తండ్రి మాణయ్య (80) మృతి విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మ బిల్కల్ గ్రామాన్ని సందర్శించి విఠల్‌ను పరమార్శించారు. ఆయన వెంట ఆ గ్రామ సర్పంచ్ పడుమటి అనుసూజ కుమారుడు శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.