'ఇంటర్నేషనల్ హబ్‌గా విశాఖ'
విశాఖ: విశాఖ జిల్లాలో త్వరలోనే ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ టాజిస్టిక్ హబ్‌గా కార్యరూపం దాల్చనుందని ఎంపీ కె. హరిబాబు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఐఎం కోసం కేంద్రం రూ.900కోట్ల ప్రతిపాదనలకు సిద్ధం చేస్తోందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలు ప్రకారమే కేంద్రం సహాయం చేస్తుందని హరిబాబు తెలిపారు. త్వరలో రాజమండ్రిలో రాత్రిపూట విమానాలు దిగేలా చర్యలు చేపడుతామని ఎంపీ హరిబాబు చెప్పారు.