మంత్రుల సమావేశంలో బొత్స నిరసన గళం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిరసనగళం వినిపించారు. బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం సరికాదన్నారు. బిల్లుపై చర్చలో పాల్గొనమని మనమే చెప్పి, ఇప్పుడు తిరస్కరించాలంటూ నోటీసు ఇవ్వడం భావ్యమా? అని బొత్స ప్రశ్నించారు.
సభలో ఇప్పటి వరకూ మట్లాడని వారందరూ కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు స్పీకర్‌కు విజ్ఞప్తిచేశామని చెప్పారు. అవసరమైతే గడువు పెంచే చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖరాసినట్లు బొత్స తెలిపారు.