వాలీబాల్ విజేత హోలీ మేరీ జట్టు
ఇంటర్ స్కూల్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ జోన్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ వాలీబాల్ ఈవెంట్లో హోలీమేరీ స్కూల్ జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ గోల్కొండ జోన్ ఆధ్వర్యంలో విజయ్‌నగర్ కాలనీలోని స్పోర్టింగ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఫైనల్లో హోలీ మేరీ జట్టు 21-17, 21-19తో స్ప్రింగ్ ఫీల్డ్ జట్టుపై విజయం సాధించింది. సఫ్దారియా గర్లస్ హైస్కూల్ 21-17, 21-10తో ఎస్వీబీపీ స్కూల్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది.
మరోవైపు కబడ్డీ అండర్-14 బాలబాలికల విభాగంలో జీహెచ్ఎస్ కల్సుంపురా, కృష్ణవేణి హైస్కూల్ జట్లు విజేతలుగా నిలవగా... అండర్-17 బాల బాలికల విభాగంలో జీహెచ్ఎస్ (దేవల్సింగ్), జీహెచ్ఎస్ (లంగర్‌హౌస్) జట్లు టైటిల్‌ను దక్కించుకున్నాయి.
కబడ్డీ మ్యాచ్‌ల ఫైనల్స్ ఫలితాలు
అండర్-14 బాలికలు: జీహెచ్ఎస్ (కల్సుంపురా) 15-12తో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌పై గెలుపొందింది.
బాలురు: కృష్ణవేణి హైస్కూల్ 15-11తో జీహెచ్ఎస్ (కల్సుంపురా)పై నెగ్గింది.
అండర్-17 బాలికలు: జీహెచ్ఎస్ (లంగర్‌హౌస్) 15-13తో సెయింట్ ట్ జోసెఫ్ (విజయ్ నగర్ కాలనీ)పై విజయం సాధించింది.