ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్–14, 17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్ – 14, అండర్ – 17 బాల బాలికల విభాగాల్లో జరిగిన వాలీబాల్ పోటీల్లో మిర్యాలగూడ జట్లు మెుదటి స్థానం సాధించగా, సూర్యాపేట జట్లు ద్వితీయ స్థానం సాధించాయి. ఈ సందర్భంగా విజేతలకు డీఈఓ చంద్రమోహన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య షీల్డు, వ్యక్తిగత బహుమతులు అందజేశారు. అనంతరం డీఈఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ముకుందాపురం ప్రభుత్వ పాఠశాల బాలికలు రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ పాఠశాల బాలికలు ఎన్నో టోర్నమెంట్లలో మెదటి స్థానం సాధించాలని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి జట్టుకు విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, సర్పంచ్ శివరామకృష్ణ, వైఎస్ ఎంపీపీ సీతారాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నూకల వెంకటరెడ్డి, అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అబ్బాస్, మాజీ సర్పంచ్ రామాంజయ్య యాదవ్, నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి, వంశీరెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు.