ఓటర్లుగా నమోదు కావాలి
జాయింట్ కలెక్టెర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ :
జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను యువత వినియోగించుకుని ఓటర్లుగా నమోదు కావాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిష¯ŒS విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల పరిధిలోని 4,262 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. జేసీ కాకినాడలోని పలు పోలింగ్ కేంద్రాల్లోని శిబిరాలను సందర్శించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సవరణ ప్రక్రియలో భాగంగా 2017 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు నమోదుతో పాటు ఓటు హక్కులేనివారు కూడా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిష¯ŒS అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియకు మరో మూడురోజుల గడువు ఉందన్నారు. ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలనను ఈనెల 14వ తేదీ నుంచి 28వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. జనవరి 5వ తేదీలోపు పరిశీలించిన దరఖాస్తులను ఆ¯ŒSలై¯ŒSలో డేటా ఎంట్రీ పూర్తిచేసి సప్లమెంటరీ జాబితాలను సిద్ధం చేస్తామని, 2017 జనవరి 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ పరిశీలనా కార్యక్రమంలో ఆర్డీవో బి.ఆర్.అంబేడ్కర్, అర్బ¯ŒS తహసీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం, అర్బ¯ŒS ఎన్నికల విభాగ డిప్యూటి తహసీల్దార్ రమేష్ పాల్గొన్నారు.