వర్షానికి కూలిన కాన్వెంట్ భవనం గోడ
పార్వతీపురం: వేమకోటి వారి వీధిలోని వీఆర్ఎం కాన్వెంట్ భవనం గోడ ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కూలిపోయింది. ఉన్నఫళంగా గోడ కూలిపోవడంతో ఆ భవనంలో ఉన్న దాదాపు 9 ఇళ్లకు చెందిన 30 మంది వరకు పిన్నా, పెద్ద భయాందోళనలకు గురయ్యారు.
పెద్ద శబ్ధంతో గోడ కూలడంతో వారి కేకలు విని వీధిలోని వారు రంగంలోకి దిగారు. మేడపై ఉన్నవారిని జాగ్రత్తగా కిందకు దించారు. తొలుత గోడకింద ఎవరైనా ఉన్నారేమోనని ఆందోళన చెందిన స్థానికులు ఎవరూ లేరని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.