ఓపెన్ చెస్ చాంప్ వరుణ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్లో ఓపెన్ కేటగిరీ టైటిల్‌ను వి.వరుణ్ దక్కించుకున్నాడు. జూనియర్ విభాగం టైటిల్‌ను శ్రీసంతోష్ కైవసం చేసుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు ఆదివారం జరిగిన ఓపెన్ విభాగం ఆరో రౌండ్లో వరుణ్... సతీష్ (4.5)పై నెగ్గాడు. దీంతో ఈ రౌండ్ అనంతరం వరుణ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇతర గేమ్‌ల్లో జశ్వంత్ (5)... రాజు (4.5)పై; గోవింద్లాల్ శర్మ (5)... శివ (4)పై గెలిచారు. భూషణ్ (4.5)... షాబాజ్ (4.5); దివాకర్ (4.5).. అనురాగ్ (4.5)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. జూనియర్ కేటగిరీ ఆఖరి రౌండ్లో శ్రీసంతోష్ (5.5)... నందితా (5)తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో వర్షిత (5.5)... విశ్వజిత్ అరవింద్ (4)పై; లాస్యా (5)... ప్రణీత్ (4)పై; శ్రీకాంత్ (5).... నీరజ్ అనిరుధ్ (3.5)పై; ప్రణవ్ (4.5).. శశిరోహిత్ వర్మ (3.5)పై గెలుపొందారు.
ఇతర ఫలితాలు: అండర్-14 బాలురు: 1.బి.వి.ఎస్.శ్రీకాంత్, 2.పి.వి.ప్రణీత్. అండర్-14 బాలికలు: 1.వై.లహరి, 2.శశాంక. అండర్-12 బాలురు: 1. ఎం.ప్రణీత్, 2. జశ్వంత్, కె.శరత్ చంద్ర. అండర్-12 బాలికలు: 1.పి.లాస్య, 2. వై.శశికళ. అండర్-10 బాలురు: 1.కె.ప్రణవ్, 2.ఎం.కౌశిక్. అండర్-12 బాలికలు: 1.వర్షిత, 2. నందిత. అండర్-8 బాలురు: 1.రిత్విక్, 2.శశి రోహిత్ వర్మ. అండర్-8 బాలికలు: 1.సాహిత్య, 2. త్రిష. అండర్-6 బాలికలు: 1. నిత్య. బెస్ట్ విమెన్: జి.సాయి కుషాల