బడ్జెట్ పై ఎవరేమన్నారు...
గ్రామీణ ఇన్ఫ్రా రంగాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం వల్ల ఉపాధి కల్పనతో సహా డిమాండ్ కూడా పెరుగుతుందని వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ తెలిపారు.
ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రా, సామాజిక రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇన్ఫ్రా రంగంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. - పవన్ గోయెంకా, ఎంఅండ్ఎం ఈడీ
ప్రభుత్వం బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ఇన్ఫ్రా వృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నియోటియా చెప్పారు.
ఈ బడ్జెట్ సమగ్రంగా ఉంది. ఎకానమీకి కీలకమైన అన్ని అంశాలనూ ఇది సృజించింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో దీన్ని ప్రవేశపెట్టిన సంగతి గుర్తుంచుకోవాలి. - చిత్రా రామకృష్ణ, ఎన్ఎస్ఈ ఎండీ
ఇది ప్రగతిశీల బడ్జెట్. దేశ వృద్ధికి దోహదపడుతుంది. ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుదల విషయంపై నాలుగేళ్ల సమయమిచ్చిందని సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ అన్నారు. రూ.10 లక్షల పరిమితి మించిన డివిడెండ్స్‌పై అదనపు పన్ను విధించడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లలోకి తక్కువ పెట్టుబడులు రావచ్చు. గతంలోనూ మనం ఇదే పరిస్థితిని చూశాం. - గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్
ఇది అభివృద్ధి అనుకూల బడ్జెట్ అని హిందూజా గ్రూప్ కంపెనీస్ (ఇండియా) చైర్మన్ అశోక్ పి. హిందూజా చెప్పారు.
ప్రజల బడ్జెట్..
వేగవంతమైన వృద్ధికి ఈ బడ్జెట్ సూచనగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారి శ్రామికవేత్తలకు స్టాండ్ అప్ ఇండియా స్కీం కింద రూ. 500 కోట్ల కేటాయింపు ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఏర్పాటు ప్రతిపాదనతో వ్యాపారవేత్తలకు ఆర్థిక అధికార సంపాదన సంవత్సరంగా 2016-17 నిలుస్తుంది. డిజిటల్ లిటరసీ గ్రామీణ భారత్‌కు బూస్ట్‌నిస్తుంది. ఆరోగ్య రక్షణ రంగానికి తొలిసారిగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆకస్మికంగా జబ్బుపడ్డ పేద కుటుంబానికి రూ.1 లక్ష ఆరోగ్య బీమా కల్పించే పథకం, 3,000 జన ఔషధి స్టోర్ల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పడం, డయాలసిస్ పరికరాల విడిభాగాలపై పన్ను మినహాయింపులు ఇవ్వడం వంటి చర్యలతో ఆరోగ్య రక్షణ, వైద్య పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుంది. - సంగీత రెడ్డి, చైర్ పర్సన్, ఫిక్కి తెలంగాణ,
ఏపీ శాఖ, అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ పన్నుల విషయంలో నిరాశ..
మొత్తంగా వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ ఇది. వ్యాపారం చేసేందుకు అనువైన వాతావరణం చూపిం చారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తుం ది. సీఐఐ ప్రతిపాదనలను చాలా వాటిని బడ్జెట్లో స్వీకరించారు. అయితే పన్నుల విషయంలోనే కాస్త నిరాశ. సెజ్‌ల మీద మ్యాట్ తీసేస్తారని అనుకున్నాం. కానీ కొనసాగిస్తున్నారు. వ్యవసాయం, రైతుల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. కొత్తగా పోర్ట్‌లు, రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధి మౌలిక రంగానికి పెద్ద ఊరట. మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈకి ప్రోత్సాహకాలు ప్రకటించడం ఆహ్వానించదగ్గది - రమేష్ దాట్ల, సీఐఐ దక్షిణ ప్రాంత వైస్ చైర్మన్
దేశీయ విమానయాన రంగానికి రెక్కలు!
దేశీయ విమానయాన రంగానికి జై ట్లీ బడ్జెట్ కొత్త శకానికి నాంది పలికింది. తక్కువ ఖర్చు వాహకాలు (ఎల్సీసీ), మోడ్రన్ ఎయిర్‌పోర్ట్స్, దేశీయ విమానరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), అధునాతన సమాచార సాంకేతికత, చిన్న విమానాశ్రయాల ఏర్పాటు, ప్రాంతీయ అనుసంధానం వంటివి విమానయాన రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తాయి. రానున్న రోజుల్లో 80-120 సీట్లుంటే విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతుంది.. దీంతో 2020 నాటికి దేశీయ విమానయాన రంగం మూడో అతిపెద్ద విమానయాన రంగంగా.. 2030 నాటికి అతిపెద్ద విమానయాన రంగంగా వృద్ధి చెందుతుంది. - రమేష్ లింగమనేని, ఎయిర్కోస్టా చైర్మన్
బడ్జెట్.. సమతూకం!
బడ్జెట్ రూపకల్పనలో సమతూకం పాటించారు. స్టార్టప్స్‌కు ఊతమిచ్చేలా చర్యలు తీసుకున్నారు. జీఎస్టీ అమలుపై కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయితే పరిశ్రమ ఆశిస్తున్నట్టుగా ప్రస్తుత కేంద్ర పరోక్ష పన్నుల విధానాన్ని ప్రతిపాదిత జీఎస్టీకి అనుగుణంగా అమలు చేయాలి. సర్వీస్ ట్యాక్స్ పెంచకపోవడం ఆహ్వానించదగ్గది. - అనిల్‌రెడ్డి వెన్నం, ఫ్యాప్సీ ప్రెసిడెంట్
వ్యవసాయానికి ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతు లు పెట్టుబడులు తగ్గించేం దుకు వ్యవసాయంలో యాం త్రీకరణ పద్ధతులు ప్రవేశ పెట్టేందుకు అవకాశం కల్పించారు. తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు ఇవ్వడం, పండించిన పం టకు మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడం వంటివి ఆహ్వానించదగిన పరిణామాలు. - జి.వెంకటేశ్వరరావు, సీఐఐ, విజయవాడ జోన్ చైర్మన్
మొత్తంగా బడ్జెట్ భేష్..
బడ్జెట్ ఓవరాల్‌గా చూస్తే బాగుంది. అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు అధిక ప్రాధాన్యం లభించింది. దేశంలో గ్రామాలు అభివృద్ధి చెందు తాయి. వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
- చిట్టూరి సురేష్‌రాయుడు, సీఐఐ, ఏపీ చైర్మన్