పాదచారులపైకి దూసుకువెళ్లిన లారీ
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున రోడ్డు పక్కనే నడుచుకుంటు వెళ్తున్న పాదచారులపైకి లారీ దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. లారీ అగకుండా వెళ్లిపోవడంతో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు లారీని ఆపేందుకు ప్రయత్నించారు.
కానీ లారీ అధిక వేగంగా వెళ్లిపోవడంతో సదరు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం రాజమండ్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.