పోలీసులే షాకయ్యారు.. వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు : నేరగాళ్లు రోజురోజుకు తెలివి మితిమీరిపోతున్నారు. కర్ణాటక పోలీసులకు దొరికిన వాకింగ్ స్టిక్ గన్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అసలు ఎవరికీ అనుమానం రాని విధంగా వాకింగ్ స్టిక్‌లో పూర్తిస్థాయి తుపాకీని తయారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని తయారు చేసిన వాడి నైపుణ్యంపై మనం ఆశ్చర్యపోవాల్సిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వాకింగ్ స్టిక్‌ను గుర్తించిన పోలీసులు ఇది మామూలు వాకింగ్ స్టిక్ అనుకున్నారు.
కానీ అనుమానం రావడంతో స్టిక్‌ను పరిశీలించిన పోలీసులు ఇది కేవలం మామూలు వాకింగ్ స్టిక్ అయితే కాదని నిర్ధారించుకున్నారు. వాకింగ్ స్టిక్ ముందు భాగంలో తూటాలు వెళ్లేందుకు మార్గం ఉన్నట్లుగా ఉంది. చేతితో పట్టుకునే స్టిక్ భాగాన్ని విప్పిచూడగా అందులో ట్రిగ్గర్ ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇది ఎక్కడ తయారు చేశారు, ఏ గ్యాంగ్ వాడుతున్నది అనేది గుర్తించాల్సి ఉంది . అయితే ఏ ప్రాంతంలో ఈ స్టిక్‌ను పోలీసులు గుర్తించారన్నది తెలియాల్సి ఉంది.