ఆ విషయంలో చైనా నంబర్ వన్!
బీజింగ్: భవిష్యత్‌లో బ్రహ్మచారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో నంబర్‌వన్‌గా చైనా నిలవనుంది. 2050 నాటికి దాదాపు మూడు కోట్ల మంది చైనా పురుషులకు వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంటుంది. వీరు వివాహం కోసం ఇతర దేశాలవైపు చూడక తప్పదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఆడ, మగ బిడ్డల పుట్టుక నిష్పత్తిలో తేడానే అని పేర్కొన్నారు.
2020 నాటికి చైనాలో 35–59 ఏళ్లమధ్య అవివాహిత పురుషుల సంఖ్య 1.5 కోట్లకు చేరుతుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకుడు వాంగ్ గ్వాంగ్ఝౌ పేర్కొన్నారు. అలాగే 2050 నాటికి 3 కోట్ల పురుషులకు అమ్మాయిలు కరువవుతారన్నారు. చదువులేని మగాళ్లకు పెళ్లిళ్లు కావడం కష్టమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చైనా యువకులు పొరుగు ఆసియా దేశాల్లోని యువతులను పెళ్లాడుతున్నారు.