Warangal Commissionerate
-
యువతుల వలపు వల! అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్..
సాక్షి, వరంగల్: న్యూడ్ కాల్స్ న్యూసెన్స్ చేస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ క్రిమినల్స్ కూడా మరింతగా అప్డేట్ అవుతున్నారు. వాట్సాప్ ద్వారా నేరుగా వీడియో కాల్స్ చేస్తున్న యువతులు ఆ ఫోన్ వినియోగదారుడిని టెంప్ట్(ప్రేరేపిస్తూ) చేసి.. వారిని కూడా వివస్త్రలు కావాలని చెప్పి మరీ ఆ సీన్‌ను వీడియో రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత వారు మొదలు పెట్టే అసలు ఆటలో ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక రూ.లక్షలు సమర్పించుకుంటున్నారు. ఇంకొందరు ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గడపతొక్కుతున్నారు. మరికొందరేమో తమ పరిధిలోని ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదికి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్.. అదిరే డ్రెస్సు.. ఆకర్షించే అందచందాలతో చూడచక్కగా ఉండే యువతులు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. ఇలా వీడియో కాల్ రాగానే.. ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మా టలకు ఫిదా అవుతున్నారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్ చేయడంతో ఉబ్బితబి్బబ్బవుతున్నా రు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్ చేస్తుంది. మీరు కూడా బాత్రూమ్కు వెళ్లి బ ట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలానే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్లను వీడియో రికార్డు చేస్తున్నారు. పోలీసుల పేరుతో కాల్స్.. ఇక్కడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్ పూర్తయ్యాక.. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఢిల్లీ సైబర్ క్రైమ్ ఏసీపీ, సీఐని మాట్లాడుతున్నానని.. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సదరు బాధితుడిని బెదిరిస్తారు. ఢిల్లీలో కేసు నమోదైందని.. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తారు. అమ్మా యి సెల్ఫోన్న్వీడియోల రికార్డ్ అంతా రికవరీ చేశామంటారు. ఆ వీడియో సదరు యువకులకే పంపడంతో నిజమేనని నమ్మేస్తారు. కేసులు, తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపించాలని కొరతారు. కొందరు అధికారులను మేనేజ్ చేయాల్సి ఉందని నమ్మబలుకుతారు. ఇలా విడతలవారీగా రూ.లక్షల్లో డబ్బులను ఆన్లైన్లో కొందరు బాధితులు సమర్పించుకున్నారు. ఈ విధంగా వరంగల్‌లోని 36వ డివిజన్ చింతల్‌కు చెందిన ఓ వ్యక్తికి అనుభవం ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ వీడియో కాల్స్‌కు స్పందించొద్దు.. సైబర్ నేరగాళ్ల ముసుగులో కొందరు యువతులు వీడియో కాల్స్ చేసి తియ్యటి మాటలతో నగ్నంగా ఉండి టెంప్ట్ చేసి ఆ తర్వాత బెదిరించి డబ్బు వసూలు చేసే కేసులు పెరుగుతున్నాయి. సమాజంలో గౌరవం ఉన్నవారు బయటకు చెప్పుకోలేక పీకల్లోతు వేధింపులు వచ్చాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా న్యూడ్ వీడియో కాల్స్‌కు స్పందించకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటివి ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. నిందితులను టెక్నికల్ డాటా ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. – ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
ఓ అవినీతి కథ.. అదే హాట్ టాపిక్!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొందరు పోలీసు అధికారుల తీరు చర్చనీయాంశమవుతోంది. కమిషనర్‌గా పి.ప్రమోద్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో అవినీతి, అక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడిన పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బందిపై కొరడా ఝుళిపించారు. సస్పెన్షన్లు, బదిలీలు, విచారణలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. దీంతో పలువురు బాధితులు నేరుగా సీపీని కలిసి ‘సెటిల్మెంట్’ అధికారులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు అధికారులు సైతం అవినీతి, అక్రమాలపై కవితలు, కథానికలు రాస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి శాఖలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఏసీపీ స్థాయి అధికారి ‘యదార్థవాది... లోక విరోధి’ అంటూ సంధించిన అస్త్రం ఇప్పుడు కమిషనరేట్ పరిధిలో హాట్ టాపిక్‌గా మారింది. అదేమిటంటే... వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల పోలీసు అధికారులతో కూడిన గ్రూపులో ఓ ఏసీపీ స్థాయి అధికారి పెట్టిన పోస్టింగ్ కలకలం రేపుతోంది. ఓ ఏసీపీ, నలుగురు ఇన్స్పెక్టర్ల తీరుపై ఆ పోస్టింగ్‌లో ధ్వజమెత్తగా, ఎవరా ఐదుగురు అనే చర్చ మొదలైంది. ‘ఈ మధ్య నేను ఒక వింత అనుభవాన్ని చవిచూశాను, అదేమిటంటే! ఓ పని మీద ఒక ఏసీపీ ఆఫీస్‌కు వెళ్లాను. డిస్పోజల్ కప్‌లో టీ ఇవ్వగా తాగాను. సంతోషం.. అంతలోనే ఏసీపీ గన్‌మెన్ వచ్చి ‘సర్ ‘ఆ’ గారు వచ్చారు! అనగానే వెంటనే నాతో సెలవు అన్నా అంటూ!(పొమ్మనకనే పొమ్మంటూ) పంపించారు. భూకబ్జాలు, భూచీటింగ్కు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు ఉండి ఎన్నోసార్లు జైలుకు వెళ్లిన సదరు ‘ఆ’ను ఏసీపీ సాదరంగా ఆహ్వానిస్తూ టీ కప్‌లు శుభ్రంగా కడిగి టీ తెమ్మని సిబ్బందిని ఆదేశించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సామాన్య ఫిర్యాదుదారులకు ఎందుకు ఇంత మర్యాద ఇవ్వరని ఆలోచించాను’ అంటూ ఆ పోస్టింగ్‌లో సదరు పోలీసు అధికారిపై ధ్వజమెత్తారు. ‘ఈ మధ్య మరో ఘటన జరిగింది, ఇరువైపులా భూకేసులు ఉన్న వారిని మభ్యపెడుతూ భూమి మీదంటే మీదని వారి వద్ద రూ.లక్షలు లక్షలు తీసుకుని ఇంకా డబ్బు కోసం ఫోన్లో మాట్లాడిన సంఘటన ఆడియో ఒక గ్రూప్‌లో లీకైంది, ఇది వరంగల్ సిటీలో ఒక సీఐ తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆయన పేరు మాత్రం పవిత్రమైన దైవగ్రంథంలోని పేరు, ఆయన చేసేవి మాత్రం సైతాను క్రియలు, అది దేవుడికే అవమానం, అలాగే అలాంటి భూముల ఓనర్లు, పెట్టుబడి పెట్టే ఒక రియల్టర్‌తో సంబంధాలు ఉన్న ముగ్గురు ఎస్హెచ్ఓ / సీఐలు సదరు రియల్టర్ కాల్ డేటా తీస్తే ఎలా అని గజగజ వణుకుతున్నారు. రకరకాల పలుకుబడితో వివిధ స్థాయిల్లోని అధికారులు, నాయకులతో ఫోన్లు చేయిస్తున్నారు’ అంటూ పేర్కొన్నారు. ఇంతకీ ఆ ఏసీపీ, ఆ నలుగురు ఇన్స్పెక్టర్లు ఎవరనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రంగంలోకి ఇంటిలిజెన్స్, ఎస్బీ అధికారిక గ్రూపులో ఓ పోలీసు అధికారి అదే శాఖకు చెందిన కొందరిపై చేసిన ఆరోపణలపై ఆరా తీసేందుకు ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంతకీ ఆ ఏసీపీ, ఆ నలుగురు ఇన్స్పెక్టర్లు ఎవరు, ఏసీపీ దగ్గరకు వచ్చిన భూవివాదాలు, కబ్జాలకు పాల్పడి, పదుల సంఖ్యలో కేసులున్న ఆ ‘ఆ’ అనే వ్యక్తి ఎవరని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసు అధికారిక గ్రూపులో వచ్చిన పోస్టింగ్, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై సమగ్ర నివేదిక తయారీకి సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆ ‘ఆ’ అనే తెలుగుదేశం హయాంలో హౌజింగ్ స్కామ్‌తో పాటు పలు అక్రమ మార్గాల్లో రూ.కోట్లు వెనకేసుకున్న ఓ రాజకీయ నాయకుడని తెలిసింది. టీడీపీ హయాంలో హవా నడిపించిన సదరు నేతకు పోలీసు అధికారి పెద్దపీట వేయడంపై చర్చ సాగుతోంది. ఏది ఏమైనా నలుగురు ఇన్స్పెక్టర్ల వ్యవహారంపై నిఘావర్గాలు ఆరా తీస్తుండటం పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. -
ఇడియట్స్
సాక్షి, వరంగల్ క్రైం: మహిళలు, యువతుల రక్షణకు చట్టసభల్లో ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. వారు ఇంట్లో, బయటా, ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతునే ఉన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా వేధింపులకు మార్గం అవుతోంది. ఫోన్లలో యువతుల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒంటరిగా కళాశాలకు వెళ్లే యువతుల కోసం బస్టాండ్ల వద్ద కాచుకుకూర్చుంటున్నారు. పోకిరీలు చేసే హేళన, సూటిపోటి మాటలను విద్యార్థినులు మౌనంగా భరిస్తున్నా రు. ఏం చేయాలో తెలియక బాధను గుండెల్లోనే దాచుకుంటున్నారు. వేధింపులు శృతి మించితేనే ఫిర్యాదు వరకు వెళ్తున్నా యి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడానికి మూడు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ వేధింపులు ఆగడం లేదు. పరువు కోసం.. కళాశాలలు, పనిచేస్తున్న కార్యాలయాలు, బంధువులు ఇలా అనేక రూపాల్లో యువతులు వేధింపులకు గురవుతున్నారు. అయినా వాటిని మౌనంగా భరిస్తూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చి కేసులు పెడితే వారికి కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదు. దీంతో ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నా మనసులో కుమిలిపోతున్నారే తప్పా బయటపడడం లేదు. ఈ పరిస్థితుల నుంచి మహిళలు, యువతులు బయటికి రావడానికి పోలీసు శాఖ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో.. గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగులను ద్వంద్వార్థాలతో వేధిస్తున్నారు. వారిని ప్రతిఘటిస్తే అది చేయడం లేదు.. ఇది చేయడం లేదు అంటూ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. అర్బన్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఉన్నతాధికారులు మహిళ అధికారులను సూటిపోటి మాటలతో వేధించడంతో వారు ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న వేధింపులను మహిళా అధికారులు, కింది స్థాయి మహిళా ఉద్యోగులు విధిలేని పరిస్థితుల్లో మౌనంగా భరిస్తున్నారు. అయితే వారు ఫిర్యాదు చేస్తే చాలు చర్యలు తీసుకునేందుకు షీ టీమ్స్ అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ తమ పరువు బజారుకెక్కుతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి దుశ్శాసనుల పీచమణచాలంటే రావల్సిందల్లా మహిళల్లో చైతన్యమే. పెరుగుత్ను కేసులు... వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నాయి. మహిళలు, యువతులు ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2015లో 188 కేసులు నమోదు కాగా, 2016లో 208 కేసులు, 2017లో 185 కేసులు, 2018లో ఇప్పటి వరకు 169 కేసులు నమోదయ్యాయి. ఈవ్‌టీజింగ్ కేసుల్లో పట్టుబడిన బాలురపై పోలీసులు కేసులు పెట్టకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చేతుల్లో వేలాది రూపాయల విలువ చేసే స్మార్ట్ఫోన్లు ఉండడం, ఇంటర్నెట్లో ఇష్టారాజ్యంగా లాగిన్ కావడం, వాట్సప్, ఫేస్బుక్ పేరిట పరిచయం లేని వ్యక్తులతో చనువుగా మాట్లాడడం, ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకుల పర్యవేక్షణ లేకపోవడం తదితర కారణాలతో యువతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు మహిళలు, యువతులను వేధింపులకు గురిచేసే ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. కమిషనరేట్ పరిధిలో మూడు బృందాలు, ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు పనిచేస్తున్నారు. అందరు మఫ్టీలో ఉంటారు. కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. ప్రతి శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఎవ్వరికైనా ఇబ్బందులు ఉంటే క్రైం ఏసీపీ 9491089112, కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257, షీటీమ్స్ ఇన్స్పెక్టర్ 7382294058 నంబర్లకు సమాచారమిస్తే వెంటనే స్పందిస్తాం. – శ్రీనివాస్‌రావు, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ -
సీఎం వద్దకు కమిషనరేట్ ప్రతిపాదనలు
వరంగల్‌క్రైం : వరంగల్ కమిషనరేట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి పంపించామని తెలంగా ణ రాష్ట్ర డీజీపీ అనుగార్‌శర్మ తెలిపారు. మొదటిసారిగా వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ అమరవీరుల స్మృతివనాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎన్.మహేశ్‌కుమార్ స్మారక వ్యాయామశాలను ప్రారంభించారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ఒక ఆశయం, లక్ష్యం కోసం పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అమరవీరులకు గుర్తు గా ఏర్పాటుచేసిన ఈ స్మృతివనంలో ఒక్కో మొక్క ఒక్కో అమరవీరుడి పేరుతో ఉం దని... ఇవి పోలీస్ అమరుల కుటుంబసభ్యుల అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. అర్బన్‌లో పోలీసుల పనితీరుపై ఆరా డీజీపీ దంపతులు సాయంత్రం జిల్లా పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నగర పరిధిలో పోలీసుల పనితీరుపై అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు వద్ద ఆరా తీశారు. ఇటీవల సంచలనం రేపిన రఘునాథపల్లి ఘటన వివరాలను అడిగారు. దొం గలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ను నియమించాలని అర్బన్ ఎస్పీని ఆదేశిం చారు. ఆ తర్వాత డీజీపీ దంపతులు వేయిసంభాలు, భద్రకాళి, పద్మాక్షి దేవాలయాల్లో పూజలు నిర్వ హించారు. అక్కడినుంచి డీజీపీ దంపతు లు డీఐజీ క్యాంపు కార్యాలయానికి చేరు కున్నారు. డీఐజీ కాంతారావు దంపతులు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భం గా డీజీపీ గతానుభూతులను నెమరువేసుకున్నారు. అనురాగ్ శర్మ 1997 నుంచి 2000 వరకు వరంగల్ రేంజ్ డిఐజీగా పనిచేశారు. వేయిస్తంభాల ఆలయంలో డీజీపీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీసుల పనితీ రుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అర్బన్, రూరల్ పోలీసు అధికారుల సంఘం నేతలు డీజీపీని కలిసి, సమస్యలపై వినతిపత్రం సమర్పించా రు. డీజీపీ వెంట అదనపు ఎస్పీలు యాదయ్య, డీఎస్పీలు హిమవతి, దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేశ్‌కుమార్, రాజమహేంద్రనాయక్, ప్రభాకర్, ఏఆర్ ఓఎస్డీ అన్వర్ హుస్సేన్, ఉన్నారు.