warangal congress leaders
-
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
వరంగల్ జిల్లా నేతలతో దిగ్విజయ్ భేటీ
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా గురువారం గాంధీభవన్‌లో ఆ జిల్లా నేతలతో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ సేకరిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల బరిలో వెంకటస్వామి తనయుడు, మాజీ ఎంపీ వివేక్‌ను నిలపాలని జిల్లా నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. పోటీ చేసేందుకు వివేక్ విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని దిగ్విజయ్ సింగ్ ... వరంగల్ జిల్లా నేతలను కోరారు. ఆ క్రమంలో సర్వే సత్యనారాయణ, ఎస్. రాజయ్య, ఆర్ ప్రతాప్ పేర్లు మాత్రం వారు వెల్లడించారు. కాగా వీరిలో ఎవరినీ ఎంపిక చేయాలనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించనుంది.