వివాహితపై అత్యాచార యత్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఉద్యోగం కోసం చెన్నైకి చేరుకున్న వరంగల్ వివాహిత మోసపోయింది. మాయమాటలు చెప్పి చెన్నైకి తీసుకువచ్చిన కుటుంబ స్నేహితుడే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన వివాహిత ఇంజనీరింగ్ పట్టభద్రురాలు కావడంతో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ స్నేహితుడు శ్రీనివాస్ (40) ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కొన్నిరోజుల క్రితం చెన్నైకి తీసుకువచ్చాడు.
ఎగ్మూరులోని ఒక అతిథి గృహంలో ఆమెకు బస ఏర్పాటు చేశాడు. సినిమా పరిశ్రమతో సంబంధాలు కలిగి ఉండడంతో ఉద్యోగం కంటే సినిమాలో వేషాలు మేలని నమ్మబలికాడు. అనంతరం ఆమెతో శారీరక సంబం ధం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచారం యత్నం చేశాడు. అక్కసుతో ఆమెను చిత్రవధకు గురిచేయసాగాడు. బుధవారం సాయంత్రం శ్రీనివాస్ బయటకు వెళ్లిన సమయంలో అతిథి గృహం నుంచి తప్పించుకుని ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చే యడంతో నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. వరంగల్‌కు సమాచారం ఇచ్చి ఆమెను బంధువులకు అప్పగించారు.