హాస్టల్ బాలికలపై వార్డెన్ భర్త అత్యాచారం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మాయిల హాస్టల్ సూపరింటెండెంట్ భర్త అదే హాస్టల్లో ఉంటున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో సూపరింటెండెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హాస్టల్ ధనోరా గ్రామంలో ఉందని, అసలైన నిందితుడు వినోద్ నాగ్ పరారీలో ఉండటంతో అతడి భార్య, హాస్టల్ సూపరింటెండెంట్ నీతా నాగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తికేయ గోయల్ తెలిపారు.
వినోద్ నాగ్ తమపై అత్యాచారం చేసినట్లు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారని, వాళ్లు ఎంత చెప్పినా సూపరింటెండెంట్ ఏమాత్రం పట్టించుకోకపోగా.. వీలైనంతవరకు కేసును తొక్కేయడానికి ఆమె ప్రయత్నించారని కలెక్టర్ తెలిపారు. దాంతో విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదుచేఏశామన్నారు.