ఇసుక అమ్మకాలు సాగిస్తే ఊరుకోం
సిద్ధాంతం (పెనుగొండ): ‘కరుగుతున్న గుట్టలు.. ఇసుక ధరకు రెక్కలు’ శీర్షికన సాక్షిలో మంగళవారం ప్రచురితమైన కథనానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు. పెనుగొండ మండలంలోని నిల్వ ఉంచిన ఇసుక గుట్టల వివరాలు సేకరించడానికి సిబ్బందిని నియమించారు. నిల్వదారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. ఎటువంటి అమ్మకాలు నిర్వహించినా ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తమ అవసరాలకు మాత్రమే ఇసుక నిల్వ చేసుకోవాలని, అమ్మకాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. పెనుగొండ తహసీల్దార్ వీఎస్ఎస్ బ్రహ్మానందం, ఎసై ్స సీహెచ్ వెంకటేశ్వరరావు ఇసుక నిల్వలు గుర్తించారు. నిల్వ దారులకు ఏఎసై ్స బి.నాగిరెడ్డి, పోలీసు సిబ్బంది నోటీసులు అందజేశారు.