మన జర్నలిజానికి తొలి అక్షర హారతి
నేటి భారతీయ పత్రికల రూపురేఖలకు 234 ఏళ్ల చర్రిత ఉంది. తొలి భారతీయ వార్తాపత్రిక బెంగాల్ గెజిట్‌ను జేమ్స్ అగస్తస్ హెకీ 1780 జనవరి 29న కలకత్తాలో స్థాపించాడు. భావస్వేచ్ఛకు ప్రతిరూపమైన పత్రిక అంటే పాలకులకు తొలి నుంచీ కంటగింపే కాబట్టి నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గెజిట్‌పై పరువునష్టం దావా దాఖలు చేసి రెండేళ్లలోపే అంటే 1782 మార్చిలో పత్రిక మూసివే తకు కారణమయ్యాడు. 1785లోపే మరో నాలుగు వార్తాపత్రి కలు వెలువడ్డాయి. 1786 జనవరి 5న వెలువడిన కలకత్తా క్రానికల్ దేశంలోనే తొలి మాసపత్రికగా నమోదైంది.
18వ శతా బ్దంలో ఇండియన్ గెజిట్, కలకత్తా గెజిట్, బెంగాల్ జర్నల్, ఇండి యన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బాంబే టైమ్స్ వంటి అనేక పత్రికలు ఆవిర్భవించినప్పటికీ ఇవన్నీ ఇంగ్లిష్ పత్రికలే. ఇంగ్లండ్ నుంచి 1818 లో వచ్చిన సిల్క్ బకింగ్‌హామ్ భారతీయ జర్నలిజంకు పితామహునిగా కీర్తిపొందారు. భారతీయ దురాచారాలను విమర్శిస్తూ, వాటిని అరికట్ట లేని ప్రభుత్వ అసమర్థతను దుయ్యబట్టేవాడు. ఈ నేప థ్యంలోనే భారతీయ పత్రికల ప్రస్థానంలో తొలిదశ సంస్కరణోద్యమం మొదలైంది. భారతీయ పత్రికలకు జన్మస్థలం కలకత్తా కాగా పత్రికల సంఘ సంస్కరణోద్యమానికి బొంబాయి వేదికైంది. హిందుత్వం గురిం చి ప్రజలకు సరైన అవగాహన కల్పించటం ఇప్పుడే మొదలైంది. సతీస హగమనాన్ని నిరసిస్తూ రాజారామ్మోహన్రాయ్ ఉద్యమించిన నేపథ్యం లో అనేక పత్రికలు వెలుగులోకి వచ్చాయి. తొలి మహిళా పత్రిక స్త్రీబోధ్ 1857లో ప్రచురితమవగా హిందూ పత్రిక 1878లో మద్రాసులో మొదలైంది.
1933లో మద్రాసులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, 41లో బ్లిట్జ్, 42లో తమిళ డైలీ, తంతి పత్రికలు జాతీయోద్యమానికి అండగా నిలిచాయి. తెలుగులో తొలి మాసపత్రిక సత్యదూత 1931లో బళ్లారిలో మొదలైంది. 1892లో కృష్ణాపత్రిక వచ్చినప్పటికీ, 1938లో వెలు వడిన వృత్తాంత తొలి తెలుగు పత్రికగా చెప్పుకోవచ్చు. తర్వాత వర్తమాన తరంగిణి, ఆంధ్రకేసరి, దేశాభిమాని, చింతామణి, గాండీవం, జనత వంటి పత్రికలు వచ్చాయి. 1908లో ఆంధ్ర పత్రిక, 38లో ఆంధ్రప్రభ, 30లో జమీన్రైతు, 45లో ప్రజాశక్తి, తర్వాత విశాలాంధ్ర, 1926లో గోలకొండ, 24లో భారతి పత్రిక వెలువడ్డాయి. ఒకప్పుడు జాతిని జాగృతం చేసిన పత్రికలు నేడు ధనికవర్గాలకు, పాల కవర్గం ముసుగులోని పెత్తందారీ వర్గాలకు బాకాలుగా మారుతున్నాన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికారంగ వ్యవస్థ ప్రజాబాధ్యతగా ఉండినప్పుడే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమనే నానుడికి పత్రికా రంగం ఆదర్శమవుతుంది.
- నేడు భారతీయ పత్రిక దినోత్సవం)
తలగాపు వెంకటరమణ ఫ్రీలాన్స్ జర్నలిస్టు, శ్రీకాకుళం