washes feet
-
ఆశా భోంస్లే కాళ్లు కడిగిన సింగర్ సోను నిగమ్ (ఫోటోలు)
-
తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు
న్యూయార్క్: అమెరికా తూర్పు తీరానికి వింత మెటల్ షీట్లు కొట్టుకువచ్చాయి. మెటల్ షీట్లకు ఫైబర్ ఊడిపోయి ఉంది. కూర్చోవడానికి వీలుగా ఉన్న ఈ మెటల్ షీట్లను మొదట యాక్టర్ మాథ్యూ జాకబ్ పెర్రీ గుర్తించాడు. న్యూజెర్సీలోని మార్గేట్లోని బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా కనుగొన్నాడు. వింతగా ఉన్న ఈ ఉనుపషీట్లను వీడియో తీసి టిక్‌టాక్ వీడియోలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. మెటల్ షీట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''అవి ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియలేదు. నేను మొదట చెట్టు కొమ్మ అనుకున్నాను. దగ్గరికొచ్చేసరికి మెటల్ షీట్లని అర్థమైంది. దగ్గరకు వచ్చేసరికి అవి విమానం సీట్లలాగే కనిపించాయి'' అని నటుడు జాకబ్ పీపుల్ మ్యాగజైన్‌తో అన్నారు. జాకబ్ పోస్టు చేసిన వీడియోలో తుప్పు పట్టిన మెటల్ షీట్లు ఇప్పటికీ స్ప్రింగ్‌లను కలిగి ఉన్నాయి. అప్పటికే ఫాబ్రిక్ ఊడిపోయింది. కొన్ని సీట్లు వాటి మధ్య మెటల్ హ్యాండ్‌రైల్‌ను కలిగి ఉన్నాయి. అవి విమానంలో ఉన్నట్లే ఉన్నాయి. ఈ వింత ఆకారాలపై సోషల్ మీడియోలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. జూలై 17, 1996న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన టీడబ్ల్యూఏ విమానం 800 శిథిలాల నుంచి సీట్లు వచ్చి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. TZB 900 విమానం అని మరో నెటిజన్ అన్నారు. అసలు అవి విమానం సీట్లు కానేకావని తాను ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ని అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ఆర్కియాలజిస్టులకు అప్పగించిన ఆర్మీ -
వారి పాదాలు కడిగి ముద్దాడిన పోప్
వాటికన్ సిటీ: ఈస్టర్ సందర్భంగా క్రైస్త్రవ పీఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ అసాధారణమైన ప్రేమను పంచి పెట్టారు. రోమ్ లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది కాళ్లు కడిగి తన నిరాడంబరతను, ప్రేమను ప్రదర్శించారు. ఈస్టర్ సంప్రదాయానికి గాను ఎంపిక చేసిన 11 మందిలో ఒక భారతీయ హిందువుతో పాటు నలుగురు నైజీరియన్ క్యాథలిక్కులు - ముగ్గురు ఎరిత్రియా మహిళలు - మాలీ - పాకిస్థాన్ - సిరియాలకు చెందిన ముగ్గురు ముస్లింల పాదాలు కడిగి, ముద్దాడారు. ఈస్టర్ సండేకు సిద్ధమవుతున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయంగా వివిధ మతాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించే ప్రక్రియలో భాగంగా...11 మంది యువ శరణార్థులు వలస కేంద్రంలో పనిచేసే ఓ ఇటాలియన్ పాదాలను పోప్ శుభ్రం చేశారు. వారి పాదాలకు నీళ్లు పోసి కడిగి తువ్వాలుతో తుడిచి పోప్ ముద్దు పెట్టుకున్నారు. దాన్ని సోదర స్పర్శగా అభివర్ణించారు. అటు గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించారు. కాగా యేసుక్రీస్తు గుడ్‌ఫ్రైడే రోజున సిలువ వేయబడటానికి ముందురోజు తన శిష్యుల కాళ్లు కడిగినట్టు పోప్ ప్రతిఏటా 12 మంది కాళ్లు కడగటం ఆనవాయితీగా వస్తోంది.ఫ్రాన్సిస్‌కు ముందున్న పోప్లు కేవలం క్యాథలిక్కుల కాళ్లు మాత్రమా కడిగేవారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఆ సాంప్రదాయాన్ని మార్చారు. 2013లో పోప్ పదవిని చేపట్టిన తరువాత ఫ్రాన్సిస్... స్త్రీలను, అన్యమతస్తులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో కూడా శరణార్థులను, ఆఫ్రికన్లను, ముస్లింలను, స్త్రీలను, ఒక హిందువును కూడా చేర్చడం విశేషంగా మారింది. మనందరి మతాలు, సంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ మనమంతా సోదరులం. శాంతిని కోరుకునేవారం అంటూ తన సందేశాన్ని వినిపించారు పోప్!...(క్లిక్ గ్యాలరీ)