The Washington Post
-
వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా
అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్‌లో భారతీయ-అమెరికన్‌కు కీలక స్థానం దక్కింది. ఉబెర్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఖోస్లా జూలై 31 నుంచి వాషింగ్టన్ పోస్ట్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేరనున్నారు. వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా సంస్థ సీఈవోకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్ బృందానికి, ఆవిష్కరణ వ్యూహానికి నాయకత్వం వహిస్తారు. తద్వారా సంస్థ సాంకేతిక లక్ష్యాల కోసం తోడ్పాటు అందిస్తారు. మీడియా ప్రపంచం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ది వాషింగ్టన్ పోస్ట్‌కి వినీత్‌ను స్వాగతిస్తున్నందుకు సోంతోషిస్తున్నామని, వాషింగ్టన్ పోస్ట్ తాత్కాలిక సీఈవో పాటీ స్టోన్సిఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌తో సహా సాంకేతిక పరిజ్ఞానంలో వినీత్‌కు ఉన్న విస్తృత నేపథ్యం తమ తదుపరి దశ ఆవిష్కరణలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఖోస్లాకు సాంకేతిక పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. యాపిల్‌లో సిరి సహజ భాషా ఇంజిన్ కోసం, ఉబెర్‌లో మ్యాప్స్ రౌటింగ్ టీమ్ కోసం ఆయన పనిచేశారు. జార్జియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందిన వినీత్ ఖోస్లా 2005 నుంచి ఆయన కృత్రిమ మేధపై పని చేస్తున్నారు. -
లైవ్‌లో తొలగింపు..ఉద్యోగుల ఫ్రస్టేషన్‌తో జడుసుకున్న దిగ్గజ సంస్థ సీఈవో!
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ సీఈవో మీటింగ్ పెట్టి ఫైర్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.అంతేకాదు తమని ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించిన ఉద్యోగుల ఫ్రస్టేషన్ దెబ్బకు జడుసుకొని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం లైవ్ ‘లే ఆఫ్స్’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈకామర్స్ రంగంతో పాటు ఇతర రంగాల్లో వ్యాపార కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో మీడియా విభాగానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లోపనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ ర్యాన్ ఆఫీస్ మీటింగ్‌లో తెలిపారు. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులతో సీఈవో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో 2,500మంది పనిచేస్తున్న సంస్థలో సింగిల్ డిజిట్ పర్సంటేజ్ సిబ్బందిని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించారు. తొలగించిన వారి స్థానాల్ని భర్తీ చేసేలా మరికొంత మందిని నియమించుకుంటామని, ఉద్యోగుల సంఖ్య తగ్గదని ర్యాన్ పేర్కొన్నారు. అంతేకాదు ఉద్యోగాల కోత మా ఆశయాలకు వ్యతిరేకం కాదు. కానీ మా కస్టమర్ల అవసరాలను తీర్చని కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రకటనలపై ఆధారపడే కంపెనీలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడమే ఉద్యోగుల తొలగింపులకు కారణమని కంపెనీ పేర్కొంది. ర్యాన్ తొలగింపుల ప్రకటనపై కంపెనీ ఉద్యోగులు మూకుమ్ముడిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కానీ ఉద్యోగుల తీరుతో జడుసుకున్న సీఈవో రిప్లయి ఇవ్వకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. Today, we came into WaPo’s so-called town hall with questions about recent layoffs and the future of the company. Our publisher dropped a bombshell on us by announcing more layoffs and then walking out, refusing to answer any of our questions. pic.twitter.com/ajNZsZKOBr — Washington Post Guild (@PostGuild) December 14, 2022 సమావేశంలో ఉద్యోగుల ప్రశ్నలకు రిప్లయి ఇచ్చేందుకు సీఈవో ర్యాన్ ఎందుకు నిరాకరించారో వాషింగ్టన్ పోస్ట్ గిల్డ్ (సంఘం) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవర్తన ఏ నాయకుడికి ఆమోదయోగ్యం కాదు. కానీ పారదర్శకత, జవాబుదారీతనం వంటి ప్రధాన విలువలు కలిగిన వార్తా సంస్థ నాయకుడు ర్యాన్ అని గిల్డ్ పేర్కొంది. కొద్ది వారాల క్రితం వాషింగ్టన్ పోస్ట్ వీక్లీ మ్యాగజైన్‌ను క్లోజ్ చేసింది.11 మంది న్యూస్‌రూమ్ ఉద్యోగులపై కోత విధించింది. ఆ ప్రకటన చేసిన కొద్ది వారాల తర్వాత..తాజాగా ఆర్థిక ప్రతికూలతల్ని కారణంగా చూపిస్తూ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. పత్రిక వీక్లీ చివరి మ్యాగజైన్‌ను డిసెంబర్ 25న ప్రచురించబడుతుందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. -
‘ది పోస్ట్’ను సుప్రీం కోర్టు జడ్జీలు చూడాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని ప్రజల దష్టికి తీసుకరావడం జర్నలిస్టుల డ్యూటీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడే జర్నలిస్టులు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వ మోసాలను బహిర్గతం చేయగలరు’ ఏకంగా 21 ఆస్కార్ నామినేషన్లు పొందిన ‘ది పోస్ట్’ సినిమాలో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక తరఫున అమెరికా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలివి. అమెరికా సుప్రీం కోర్టు చిత్తశుద్ధి చెక్కు చెదరకపోవడం వల్ల అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా, మీడియా స్వేచ్ఛకు అండగా అమెరికా సుప్రీం కోర్టు నిలబడగలిగింది. జడ్జీలు నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండడం వల్లనే సాధ్యమైంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియాను ఆడిపోసుకుంటున్న సమయంలో చరిత్రలో మీడియా నిర్వహించిన సముచిత పాత్రను హైలెట్ చేస్తూ హాలివుడ్ సుప్రసిద్ధ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బెర్గ్ ఈ చిత్రాన్ని తీశారు. మహిళా ప్రాధాన్యత గల ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో మెరిల్ స్ట్రీప్ నటించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం వియత్నాంపై మూడు దశాబ్దాలపాటు యుద్ధం చేసి చతికిలపడిన అమెరికా ప్రభుత్వం వైఖరేమిటో ‘పెంటగాన్ పేపర్స్ (అమెరికా సైనిక పత్రాలు)’ వాషింగ్టన్ పత్రిక పలు వ్యాసాలను ప్రచురించింది. వాటిని సహించలేని నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిస్సన్ ముందుగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికపై ఆంక్షలు విధించడంలో విజయం సాధిస్తారు. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా, కోర్టు ధిక్కార నేరం కింద పత్రిక పబ్లిషర్‌కు, సంపాదకునికి జైలు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వ్యాసాల ప్రచురణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పత్రిక అమెరికా కోర్టు బోను ఎక్కాల్సివస్తుంది. అప్పుడు మీడియాకు కోర్టు అండగా నిలబడుతుంది. పెంటగాన్ పత్రాలను 1970లో వెలుగులోకి తెచ్చిన వాషింగ్టన్ పోస్ట్, ఆ తర్వాత ‘వాటర్‌గేట్’ కుంభకోణాన్ని 1974లో వెలుగులోకి తెచ్చి ‘న్యూయార్క్ టైమ్స్’ భారత మీడియాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని, భారత సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు జడ్జీలందరూ ‘ది పోస్ట్’ సినిమా చూడాల్సిన అవసరం ఉందని సినిమా విమర్శకులు సూచిస్తున్నారు.