కావలి కాలువలో తల్లీబిడ్డ మృతదేహాలు
సంగం: ఏం జరిగిందో ఏమో ఓ తల్లీబిడ్డ విగతజీవులుగా కావలి కాలువలో తేలారు. మర్రిపాడు సమీపంలో తూ ముకు ఓ వైపు తల్లి, మరోవైపు బిడ్డ మృతదేహాలు నీళ్లలో తేలుతుండగా శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. కావలి కాలువలో నీటిప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ క్రమం లో మూడు రోజుల క్రితం ఓ మహిళ(30) మృతదేహం కాలువలో కనిపిం చగా రైతులు పట్టించుకోలేదు.
శుక్రవారం సమీపంలో ఓ చిన్నారి(4) మృతదేహం కూడా కనిపించడంతో తల్లీబిడ్డలుగా భావించి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘ టనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాచిలో ఇరుక్కుపోయిన మృతదేహాల ను వెలికితీసేందుకు స్థానికులు వెనుకాడారు. దీంతో నెల్లూరు నుంచి కొందరిని పిలిపించి మృతదేహాలను వెలికితీ యించారు. ఆ మహిళ పంజాబీ డ్రెస్, బాలుడు టీషర్టు, నిక్కర్ ధరించివున్నా డు.
ఆమె మెడలో బంగారు సరుడుపై ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీయగా 2008లో త యారుచేసినట్లుగా తెలిసింది. దీంతో ఆమెకు ఆ ఏడాదే వివాహమైనట్లు భా విస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలే ని విధంగా మారడంతో వారం క్రిత మే ప్రాణాలు కోల్పోయినట్లు అనుమాని స్తున్నారు. ఇద్దరూ ఇటీవలే గుండు చే యించుకోవడంతో జుట్టు కొద్దిగా ఉం ది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంగం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.