తుంగభద్ర డ్యామ్‌కు పెరుగుతున్న వరద ఉద్ధృతి
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద పోటేత్తింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 97 టీఎంసీలు ఉందని అధికారులు వెల్లడించారు. దాదాతో 33 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. నదీపరివాహాక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. మరికొన్ని రోజుల పాటు వరద ఉద్ధృతి కోనసాగుతుందని చెప్పారు. తుంగభద్ర జలాశయంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు అన్న విషయం తెలిసిందే.