హ్యాపీ న్యూ ఇయర్
న్యూ ఇయర్-2015కు జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పల్లెలు.. పట్టణాలు, అనంత నగరంలో ‘నూతనో’త్సాహం పెల్లుబికింది. కాలనీలు, ఆపార్ట్మెంట్లలో ఆట పాటల మధ్య బుధవారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు ఉత్సాహంగా గడిపారు.
సిక్స్టీ.. ఫిఫ్టీ నైన్, ఫిఫ్టీ ఎరుుట్.. టెన్.. నైన్.. త్రీ.. టూ.. వన్ అంటూ కౌంట్ డౌన్ ముగియగానే ఒక్క సారిగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వైకుంఠ ఏకాదశి ఘడియలు రావడంతో నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని దేవుడిని ప్రార్థించడానికి ఆలయూలకు బయలుదేరారు.
- అనంతపురం కల్చరల్