Welding works
-
చలిదెబ్బకు రైల్వేకు వణుకు
సాక్షి, గుంతకల్లు: శీతాకాలం అంటే రైల్వే అధికారులకు హడల్. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో రైలు కమ్మీలకు తగినంత ఉష్ణోగ్రత లేని కారణంగా రైలు కమ్మీలు, రైల్ వెల్డింగ్‌లు విరిగిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా నల్లరేగడి, చెరువుల సమీపాన ఉన్న ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3.00 గంటల నుంచి ఉదయం 7.00 గంటల వరకు, సాయంత్రం 7.00 రాత్రి 10.00 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. గడిచిన నెలరోజుల్లో డివిజన్ వ్యాప్తంగా 09 ప్రాంతాల్లో రైలు పట్టాలు విరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహా డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కరితోనే 16 కి.మీల గస్తీ.. ట్రాక్ పరిరక్షణలో అత్యంత కీలకమైన ట్రాక్‌మెన్ రోజూ 16 కి.మీలు గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్యాంగ్‌మెన్ 4 కి.మీలు పరిధి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెండు పర్యాయాలు ఈ మార్గంలో గ్యాంగ్‌మెన్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 6.00 నుంచి అర్ధరాత్రి 12.00 గంటల దాకా ఒక షిప్టు, ఇదిలా ఉండగా మధ్యరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు నిర్వహించే నైట్ పెట్రోలింగ్ (రాత్రి గస్తీ) విధులకు ఇద్దరు గ్యాంగ్‌మెన్ పని చేస్తుంటారు. ప్రస్తుతం నైట్ పెట్రోలింగ్ విధులకు ఒక్క గ్యాంగ్‌మెన్ నియమించడం భయాందోళన కల్గిస్తోందని గ్యాంగ్మెన్లు చెబుతున్నారు. ఇతర డివిజన్లలో నైట్ పెట్రోలింగ్ ఇద్దరు గ్యాంగ్మెన్తో చేయిస్తుంటే గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఒక్కరేతోనే నిర్వహిస్తుండటం దారుణమంటున్నారు. అసలే చలి కాలం రాత్రిపూట రైలు పట్టాల వెల్డింగ్ చలికి కరిగిపోయి పట్టాలు పగిలే ప్రమాదం ఉంది. దురదష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈనెల 03న డివిజన్లోని వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో రైలు పట్టాల అసైన్మెంట్ విరిగి తిరుపతి–షిరిడీ వెళ్లే సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌తో వెళ్తుండటంతో పెను ప్రమాదం జరగలేదు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే మాత్రం సిబ్బందిని పెంచాల్సిందే. రైలు పట్టాల ఉష్ణోగ్రతపై ఆరా.. ప్రస్తుతం చలికాలం కావడంతో రైలు పట్టాలు విరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో రైలు పట్టాల ఉష్ణోగ్రత వివరాలపై ఆరా తీస్తున్నట్లు రైల్వే మార్గాల పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రైలు పట్టాలను తరుచుగా అల్ట్రా సోనిక్ ఫ్ల డిటెక్టర్ ద్వారా పరీక్షలు చేయాలని సూచించి ఆ వివరాలను తమకు తెలియజేయాలని ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కి.మీల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సిబ్బంది కొరత ఉంది. డివిజన్ వ్యాప్తంగా దాదాపు 1700 ట్రాక్‌మెన్ పోస్టులు ఖాళీ ఉండగా గడిచిన ఆగస్టు నెలలో 986 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 714 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. -
హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్నిప్రమాదం
-
హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దీంతో మంటలు చెలరేగటంతో... వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించి వీడియో .... -
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
తిరువూరు : స్థానిక గణేశ్ సెంటర్లోని ఒక షోరూం వద్ద బోర్డు ఏర్పాటు కోసం గురువారం కొలతలు తీస్తున్న వెల్డింగ్ పని చేసే కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.... బైపాస్ రోడ్డులో ఫౌండ్రీ పనులు చేసే సుతారి రామబ్రహ్మాచారి(35) ఒక షోరూం బోర్డు ఏర్పాటుకు కొలతలు తీసేందుకు వచ్చాడు. ఆ షోరూం భవనాన్ని ఆనుకుని హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి. అతను బోర్డు ఏర్పాటు కోసం కొలతలు తీసే క్రమంలో హైటెన్షన్ విద్యు™Œ వైరు చేతికి తగిలి కింద పడిపోయాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. రామబ్రహ్మాచారికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే పరామర్శ రామబ్రహ్మాచారి భౌతికకాయం వద్ద ఎమ్మెల్యే రక్షణనిధి, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామబ్రహ్మాచారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శీలం నాగనర్సిరెడ్డి, కౌన్సిలర్లు రామవరపు లక్ష్మణరావు, ఏరువ ప్రకాష్‌రెడ్డి, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి తదితరులు కూడా రామబ్రహ్మాచారి మృతదేహానికి ఏరియా ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు. -
గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి
-
గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి
వెల్డింగ్ పనులు చేస్తుండగా ఘటన ముంబై: గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ట్యాంకర్ రెండు ముక్కలైపోయి చెల్లాచెదురైంది. వివరాల్లోకెళితే.. చెంబూర్ గడ్కరీ మార్గంపై ఉన్న ఓ గ్యారేజీలో మంగళవారం పేలుడు సంభవించింది. గ్యాస్ రవాణా చేసే ఖాళీ ట్యాంకర్‌కు మరమ్మతు పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో పేలిపోయింది. వెల్డింగ్ పనులు చేస్తున్న షఫిక్ షేక్(18) అనే వ్యక్తితోపాటు మరో 45 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గ్యారేజీలో పనిచేసే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. టాంకర్లో కొంచెం గ్యాస్ మిగిలిపోవడంతో వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పంటుకుని ట్యాకర్ పేలిపోయిందని బీఎంసీ డి జాస్టర్ కంట్రోల్ సంస్థ తెలిపింది. ఈ ఘటనలో చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదు. టాటాపవర్‌కు చెందిన పవర్‌లైన్ ఓవర్‌హెడ్‌కు నష్టం జరిగినట్లు పేర్కొంది. తృటిలో తప్పిన పెను ముప్పు ట్యాంకర్ పేలుడు జరిగిన స్థలానికి సమీపంలోనే హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీకి చెందిన స్టోరీజీ సెంటర్ ఉంది. అక్కడ వేల లీటర్ల పెట్రోల్ స్టోర్ చేస్తుంటారు. పేలుడు జరిగినపుడు అగ్నికీలలు అక్కడివరకు చేరుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండేది.