విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
తిరువూరు : స్థానిక గణేశ్ సెంటర్‌లోని ఒక షోరూం వద్ద బోర్డు ఏర్పాటు కోసం గురువారం కొలతలు తీస్తున్న వెల్డింగ్ పని చేసే కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.... బైపాస్ రోడ్డులో ఫౌండ్రీ పనులు చేసే సుతారి రామబ్రహ్మాచారి(35) ఒక షోరూం బోర్డు ఏర్పాటుకు కొలతలు తీసేందుకు వచ్చాడు. ఆ షోరూం భవనాన్ని ఆనుకుని హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి. అతను బోర్డు ఏర్పాటు కోసం కొలతలు తీసే క్రమంలో హైటెన్షన్ విద్యు™Œ వైరు చేతికి తగిలి కింద పడిపోయాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. రామబ్రహ్మాచారికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
రామబ్రహ్మాచారి భౌతికకాయం వద్ద ఎమ్మెల్యే రక్షణనిధి, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామబ్రహ్మాచారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు శీలం నాగనర్సిరెడ్డి, కౌన్సిలర్లు రామవరపు లక్ష్మణరావు, ఏరువ ప్రకాష్‌రెడ్డి, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి తదితరులు కూడా రామబ్రహ్మాచారి మృతదేహానికి ఏరియా ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు.