గిరిజన సహకార సంస్థ ఎదుట బీజేపీ ధర్నా
గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా మన్ననూర్లోని జీసీసీ కార్యాలయం ఎదుట గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మన్ననూర్ కేంద్రంగా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలు, కస్తూర్భా, ఆశ్రమ పాఠశాలలకు ప్రతినెలా నిత్యవసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
ట్రేడర్లు, మర్చంట్లతో కుమ్మకై నాసీరకం సరుకులు పంపిణీ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.