west gengal
-
నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రజాదరణ మూటగట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన ‘దీదీ కే బోలో’కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి రెండు రోజుల్లోనే 2 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరో లక్ష మంది వారి అభిప్రాయాలను హెల్ప్‌లైన్ నెంబర్, వెబ్‌సైట్‌ల్లో పంచుకున్నారు. ఇంకా ఫోన్ కాల్స్‌ని లెక్కిస్తూనే ఉన్నాం. భారీ స్పందన లభిస్తోంది’అని వెల్లడించాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చవిచూసిన మమతా బెనర్జీ తిరిగి ప్రజాదరణ సమకూర్చుకునే దిశగా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడానికి వెయ్యి మందికి పైగా పార్టీ నేతలు రానున్న 100 రోజుల్లో 10వేల గ్రామాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా ప్రారంభించిన ఈ భారీ ప్రజాదరణ కార్యక్రమం కోసం మమతా.. 9137091370 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. -
యూటర్న్ తీసుకున్నమమత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. నరేంద్ర మోదీ ఈ నెల 30న రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఆమె డుమ్మా కొడుతున్నారు. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన మమతా.. రెండోరోజే మాట మార్చారు. మోదీ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కావడం లేదంటూ మమతా బెనర్జీ ఈ మేరకు ఓ లేఖ రాశారు. కాగా బెంగాల్లో జరిగిన హింసలో 54మంది బీజేపీ కార్యకర్తలు మరణించారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని, బెంగాల్లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదని అన్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు, కుటుంబ కలహాల వల్లే ఆ హత్యలు జరిగాయని మమత పేర్కొన్నారు. ఆ హత్యలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా బెంగాల్లో చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను కూడా ఆ పార్టీ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంపై మమత గుర్రుగా ఉన్నారు. -
బాంబులు పేలి ఆరుగురి మృతి
బెంగాల్లో ఘటన మాల్దా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగా అవి పేలి సోమవారం ఇద్దరు సీఐడీ అధికారులు మరణించారు. అంతకుముందు అక్కడే బాంబు పేలి నలుగురు మృతిచెందారు. మే 5న చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. మాల్దా జిల్లా జౌన్పూర్ గ్రామంలో గైసు షేక్ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాంబులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒకరు సంఘటన స్థలంలో, ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. ఆ గ్రామంలో మరో రెండు బాంబుల్ని కనుగొనడంతో సీఐడీకి చెందిన బాంబు నిర్వీర్వ బృందానికి సమాచారమిచ్చారు. వాటిని నిర్వీరం చేస్తుండగా పేలడంతో విశుద్దానంద మిశ్రా, సుబ్రతా చౌదరి అనే ఇద్దరు సీఐడీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.