west indies test
-
స్టీవెన్ స్మిత్ సెంచరీ
కింగ్స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ (336 బంతుల్లో 175 బ్యాటింగ్; 19 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాణించాడు. దీంతో శుక్రవారం రెండో రోజు కడపటి వార్తలందేసరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 117 ఓవర్లలో 8 వికెట్లకు 350 పరుగులు చేసింది. క్రీజులో తనతో పాటు హాజెల్‌వుడ్ (25 బంతుల్లో 5 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 258/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌ను విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. అయితే వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం ఓపిగ్గా ఆడుతూ జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. టేలర్‌కు ఐదు, హోల్డర్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
విండీస్ కెప్టెన్‌గా స్యామీ
సెయింట్ జాన్స్: వచ్చే నెలలో జరగనున్న భారత్ పర్యటన కోసం వెస్టిండీస్ టెస్టు జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పేసర్ డారెన్ స్యామీకి మరోసారి జట్టు పగ్గాలు అప్పగించారు. భారత్, వెస్టిండీస్‌ల మధ్య రెండు టెస్టులు (నవంబర్ 6 నుంచి 10; 14 నుంచి 18 వరకు) జరుగుతాయి. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ ‘ఎ’ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. జట్టు: స్యామీ (కెప్టెన్), బెస్ట్, డారెన్ బ్రేవో, చందర్‌పాల్, కొట్రీల్, డియోనరైన్, ఎడ్వర్డ్స్, గేల్, పెరుమాల్, పావెల్, రామ్‌దిన్, రోచ్, శామ్యూల్స్, షిల్లాంగ్‌ఫోర్డ్, వాల్టన్.