వెస్ట్రన్ యూపీ ప్రాజెక్ట్ విక్రయించిన గాయత్రి ప్రాజెక్ట్స్
ప్రాజెక్టు విలువ 575 కోట్లుగా అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్సై యూపీ టోల్వే లిమిటెడ్ (డబ్ల్యూయూపీటీఎల్)లో 100 శాతం వాటాను క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీటీఈకి విక్రయించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. డబ్ల్యూయూపీటీఎల్లో గాయత్రి ప్రాజెక్ట్స్కు 49 శాతం వాటా ఉండగా, ఎన్సీసీ 51 శాతం వాటాను కలిగి ఉంది.
లావాదేవీలు పూర్తవడానికి రెండు నెలలు పడుతుందని అంచనా. రుణ భారం తగ్గించుకునే పనిలో భాగంగా డబ్ల్యూయూపీటీఎల్ను విక్రయించింది. రూ. 756 కోట్ల వ్యయంతో ఎన్హెచ్ 58లో నిర్మించిన 78 కి.మీ ఈ రోడ్ ప్రాజెక్ట్ 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విలువను రూ. 575 కోట్లుగా అంచనా. గతేడేది ఈ ప్రాజెక్టు వార్షిక ఆదాయం రూ. 108 కోట్లుగా నమోదయ్యింది.